telugu navyamedia
crime culture news

డెలివరీ బాయ్ లా వచ్చి… ప్రాణాలు తీయబోయాడు

Men

గతేడాది నవంబరు 7న టొరొంటోలోని బేబెర్రీ ప్రాంతంలో మహిళను చంపడానికి డెలివరీ బాయ్ వేషంలో వచ్చిన వ్యక్తి ఫుటేజ్‌ను తాజాగా పోలీసులు విడుదల చేశారు. డెలివరీ బాయ్‌ వేషంలో మహిళ ఇంటికి వచ్చిన వ్యక్తి తనతో పాటు ఓ బాక్స్‌ను కూడా తీసుకొచ్చాడు. సీసీ పుటేజ్‌లో రికార్డ్ అయినదాని బట్టి నిందితుడు ఇంటి బెల్ కొట్టిన తరువాత మహిళ వచ్చి తలుపు తీసింది. అప్పుడు ఆమెతో ఏదో మాట్లాడాడు నిందితుడు. అనంతరం బాక్స్‌లో ఉన్న క్రాస్‌బౌ (ఒక రకమైన విల్లు)తో మహిళ ఛాతిలోకి విల్లును దింపాడు. వెంటనే అప్రమత్తమైన మహిళ తలుపు మూసేసింది. దీంతో నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ దాడిలో దాదాపు ప్రాణాపాయ స్థితికి వెళ్లిన మహిళ నెమ్మదిగా కోలుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. పోలీసులు విడుదల చేసిన ఫుటేజ్‌లో మహిళపై దాడి చేసే సన్నివేశాన్ని తీసేసినట్టు చెప్పారు. నిందితుడిని పట్టుకోడానికే ఈ ఫుటేజీని విడుదల చేశామన్నారు. గాయపడ్డ మహిళ వివరాలు మాత్రం పోలీసులు ప్రకటించలేదు. డెలివరీ బాయ్ వేషంలో వెళ్లిన వ్యక్తికి, మహిళకు ఎటువంటి పరిచయం లేదని, ఎవరో కావాలనే మహిళను చంపడానికి నిందితుడిని ఉపయోగించుకున్నారని అధికారులు తెలియజేశారు.

Related posts

మాల్యాను భారత్ కు అప్పగిస్తానన్న బ్రిటన్.. ఈ కల నెరవేరేనా..

vimala p

రేవంత్ కారుపై పెండింగ్ చలానాలు.. ప్రచారంలో వసూలు చేసిన పోలీసులు

vimala p

చంద్రబాబును ఏపీ నుంచి వెళ్లగొడితేనే ప్రత్యేక హోదా: రోజా

vimala p