telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

మద్యం మత్తులో మహిళ… అక్కడ దాచిన డ్రగ్స్ ను పోలిసుల ముందే తీసి ముక్కుతో పీలుస్తూ…

Drugs

కెంటుకీకి చెందిన కాథరిన్ అహ్లర్స్ (28) అనే మహిళను లెక్సింగ్టన్‌లో శుక్రవారం రాత్రి 11.30 ప్రాంతంలో మద్యం మత్తులో రోడ్డుపై అడ్డదిడ్డంగా వాహనం నడుపుతుంటే వించెస్టర్ పోలీసులు ఆపారు. వాహనంలో ఆమెతో పాటు ఓ వ్యక్తి, వెనక సీటులో చిన్న పిల్లోడు కూడా ఉన్నాడు. కాథరిన్‌తో పాటు సదరు వ్యక్తి కూడా పూటుగా మద్యం సేవించాడు. అడ్డగించిన పోలీసులకు కాథరిన్ తాము సిన్సినాటికి వెళ్లాలని, దారి తప్పినట్టు చెప్పింది. ఆ సమయంలో ఆమె మాటలు తడబడుతున్నాయి. తన కాళ్లపై తాను సరిగ్గా నిలబడలేకపోతుంది. దాంతో పోలీసులు కాథరిన్‌తో పాటు ఆమెతో ఉన్న వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి చేతులకు బేడీలు వేసి తమ వాహనంలో కూర్చొబెట్టారు. పోలీస్ వాహనం ఎక్కిన తరువాత బ్యాక్ సీటులో కూర్చున్న కాథరిన్ మద్యం మత్తులో వింత పని చేసింది. తన జననాంగాల్లో దాచిన పెట్టిన డ్రగ్స్ పొట్లాన్ని బయటకు తీసింది. ఆ తరువాత చేతులకు బేడీలు ఉండడంతో దాన్ని కాలితోనే సీటుపై పారబోసి ముక్కుతో పీల్చుకోవడం చూసిన పోలీసులకు నోటమాట రాలేదు. దాంతో కాథరిన్‌పై డ్రగ్స్ వినియోగం, బహిరంగంగా మద్యం సేవించడం, తనతో పాటు ఉన్న చిన్నపిల్లోడి సంక్షేమానికి అపాయం కలిగించడం నేరాల కింద కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.

Related posts