telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

రాంగ్ రూట్ లో బస్సు డ్రైవర్‌… ఈ అమ్మాయి ఏ విధంగా గుణపాఠం చెప్పిందో చూడండి

Bus

కేరళ స్టేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్టు (కేఎస్‌ఆర్టీసీ) చెందిన ఓ బస్సు డ్రైవర్ ఎడమవైపున వెళ్లకుండా కుడివైపు నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అదేమార్గంలో ఓ మహిళ అడ్డురావడంతో బస్సు ఆగిపోయింది. అయితే తాను సరైన దిశలోనే వస్తున్నానంటూ పక్కకు తప్పుకునేందుకు ఆ మహిళ అంగీకరించలేదు. బస్సుకు స్కూటీని అడ్డుపెట్టి అక్కడే నిలబెట్టేసింది. దీంతో తన తప్పు తెలుసుకున్న డ్రైవర్ చేసేదేమీ లేక బుద్ధిగా ఎడమవైపు సరైన దిశలోకి బస్సును మళ్లించాడు. ది గోస్ట్ రైడర్ 31 పేరుతో ఉన్న ఓ నెటిజన్ దీన్ని ట్విటర్లో పోస్టు చేశారు. ‘‘మీరు సరిగ్గా ఉన్నప్పుడు అదే మీకు వేరొక బలాన్ని అందిస్తుంది. తప్పు మార్గంలో వస్తున్న ఓ బస్సు డ్రైవర్‌కు జో అనే రైడర్ అంగుళం కూడా దారి ఇవ్వలేదు. నిజంగా ఆమెకు సలాం…’’ అని ఈ సందర్భంగా సదరు నెటిజన్ వ్యాఖ్యానించారు. కేరళలోని కసరగోడ్-కొట్టాయం రహదారిపై ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. దీని తాలూకు వీడియో సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను 96 వేలమంది వీక్షించగా… 7 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.

Related posts