చైనాలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళకు అనుకోని సంఘటన ఎదురైంది. ఈ ఘటన బుధవారం తూర్పు చైనాలోని గన్జౌ నగరంలో చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే అప్రమత్తమైన ఆమె అక్కడి నుంచి దూరంగా పరిగెత్తడంతో తృటిలో ప్రాణాలతో బయటపడింది. గోడ వెంబడి నిలిపి ఉంచిన మూడు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. కాగా వాటర్ పైపులు పగిలి చాలా రోజులుగా నీరు లీక్ అవుతుండడంతో గోడ బలహీనపడి కూలిపోయినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో తాజాగా చైనీస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరు కూడా వీక్షించండి.
previous post
అతి విశ్వాసంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి: చంద్రబాబు