telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

బాల్కనీలో రైలింగ్ పై యోగాసనం… ఆమె 100 ఎముకలు విరిగాయి…!

Yoga

మెక్సికోలోని న్యువో లియోన్‌కు చెందిన అలెక్సా టెర్రాజాస్ (23) అనే యువతి తాను నివాసముండే భవనం ఆరో అంతస్తులో తన ప్లాట్ బాల్కనీలో యోగాసనలు వేస్తుండేది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బాల్కనీ రైలింగ్‌పై యోగాసనం వేయబోయింది. తల కిందులుగా వేలాడుతూ ఫొటోకు ఫోజులిచ్చింది. అంతే… అలెక్సా ఒక్కసారిగా అదుపుతప్పి 25 మీటర్ల ఎత్తు నుంచి కింద పడిపోయింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అది గమనించిన చుట్టుపక్కల వారు అంబులెన్స్‌తో పాటు పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్‌లో ఆమెను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో సుమారు 11 గంటలపాటు సర్జరీ చేసిన వైద్యులు ఆమెను బతికించారు. అయితే అలెక్సా శరీరంలోని సుమారు 100కు పైగా ఎముకలు విరిగినట్టు వైద్యులు తెలిపారు. ప్రధానంగా పుర్రె, వెన్నముక, కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. దాంతో ఆమె లేచి నడవడానికి కనీసం మూడేళ్లైన పట్టొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికీ ఆమె పరిస్థితి క్లిష్టంగానే ఉందని చెప్పారు. కాగా, అలెక్కా పక్కింటి వారు ఆమెను చాలాసార్లు బాల్కనీలో ఇలా ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తుండడం చూసి వారించినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి ముందు అలెక్సా బాల్కనీ రైలింగ్‌పై వేసిన యోగాసనానికి సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Related posts