telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ట్రిప్ ముగించుకొని వచ్చిన దంపతులు… అనుకోని అతిథి కన్పించడంతో షాక్

Python

క్రిస్మస్ వేడుకను విదేశాల్లో ఎంత ఘనంగా జరుపుకుంటారో అందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన లియాన్ చాప్మన్ దంపతులు కూడా తమ ఇంటి బాల్కనీలో ఒక పెద్ద క్రిస్మస్ ట్రీని పెట్టారు. ఈ క్రమంలో వారు బ్యాక్‌ప్యాకింగ్ ట్రిప్ కోసమని ఇంగ్లండ్ వెళ్లారు. కొన్ని రోజుల తరువాత ట్రిప్ ముగించుకొని నుంచి తిరిగి ఇంటికి వచ్చారు. అయితే, ఇంట్లో సేదతీరుతున్న వారికి బాల్కనీలో పక్షుల అరుపులు వినిపించాయి. దాంతో ఇంటి నుంచి బయటకు వచ్చి బాల్కనీ వైపు వెళ్లి చూశారు. ఆ సమయంలో క్రిస్మస్ ట్రీపై ఏదో ఉన్నట్టు కనిపించడంతో కొంచెం దగ్గరికెళ్లి చూశారు. అంతే.. ఒక్కసారి షాకయ్యారు. ఆ చెట్టుపై ఏకంగా 10 అగుడుల కొండచిలువ ఉంది. దాంతో లియాన్ చాప్మన్ దంపతులు ఇంట్లోకి పరుగులు పెట్టారు. కిటికీలోంచి చూస్తుండగానే కొంతసేపటికి తర్వాత కొండచిలువ అక్కడి నుంచి వెళ్లిపోయిందని లియాన్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Related posts