telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఫస్ట్‌ నైట్‌ రోజే శీల పరీక్షలు.. యువతి ఫెయిల్‌ అయిందని దారుణం

మహారాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. వర్జినిటీ టెస్టుల్లో ఫెలయ్యారని ఇద్దరు వధువులను పుట్టింటికి పంపించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు వివరాల్లోకి వెళితే… మహరాష్ట్రలోని కొల్లాపూర్‌కు చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లకు అదే గ్రామానికి చెందిన అన్నాతమ్ముళ్లతో గతేడాది నవంబర్‌ 27న వివాహం అయింది. అయితే.. ఫస్ట్ నైట్‌ తర్వాత ఆ వధవులు వర్జీనిటా ? కాదా అని తెలుసుకోవడానికి ఇద్దరు అక్కాడచెల్లెళ్లకు వర్జినిటీ టెస్టులు నిర్వహించారు. అయితే.. ఈ పరీక్షల్లో ఒకరు మాత్రమే పాస్‌ కాగా.. మరొక యువతికి ఎలాంటి రక్తస్రావం కాలేదు. దీంతో ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్లను పుట్టింటికి పంపించేశారు. ఈ పెళ్లిని తక్షణమే రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించడమే కాకుండా.. 10 లక్షల రూపాయలను ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై అమ్మాయి తల్లిదండ్రులు జాత్‌ పంచాయతీ వారిని సంప్రదించగా.. అక్కడ కూడా వారికి ఎదురుదెబ్బ తగిలింది. కులంలోని కట్టుబాట్ల ప్రకారం వర్జినిటీ టెస్టులో యువతి విఫలం అయిందని… దీంతో ఆమెకు ఇదివరకే ఎవరితోనో సంబంధం ఉందని పంచాయతీ పెద్దలు ఆరోపించారు. అంతేకాకుండా ఆ కుటుంబాన్ని కులం నుంచి వెలివేస్తున్నామని తీర్పు చెప్పారు. దీంతో ఆ బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… కేసు బుక్‌ చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Related posts