telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నవ్వు నాలుగు విధాల చేటు… అందులో ఒకటి ఇదేనేమో…!

Laughing

నవ్వు నాలుగు విధాల చేటు అంటారు పెద్దలు. కానీ నవ్వు అన్ని విధాలా ఆరోగ్యానికి మంచిదని వైద్యులు అంటున్నారు. ఏదేమైనా ఓ మహిళకు మాత్రం నవ్వు వల్ల విచిత్రమైన సమస్య ఎదురైంది. చైనాలో ఓ మహిళ బిగ్గరగా నవ్వి సమస్యను కొనితెచ్చుకుంది. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో పగలబడి నవ్విన ఆ మహిళ దవడ ఎముక జారిపోయింది. దవడ ఎముక పక్కకు జరగడంతో ఆమె నోరు అలాగే తెరుచుకొని ఉండిపోయింది. దీంతో ఇటు నోరు మూయలేక.. అటు మాట్లాడలేక మహిళ కొద్దిసేపు నరకం అనుభవించింది. అయితే అదృష్టవశాత్తు ఆ రైలులోనే లివాన్ ఆసుపత్రికి చెందిన లువో వెన్‌షెంగ్ అనే వైద్యుడు కూడా ఉండడంతో ఆమెకు వెంటనే ప్రథమ చికిత్స అందించాడు. అనంతరం మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయడంతో దవడ ఎముక యధాస్థితికి వచ్చింది. దీంతో మహిళ ఊపిరిపీల్చుకుంది. ఇప్పుడీ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది.

Related posts