telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

రూ.900ల ఉంగరం ఆ యువతిని కోటీశ్వరురాలిని చేసింది…!?

Ring

లండన్‌లో ఓ యువతికి ఉంగరం రూపంలో అదృష్టం వరించింది. కూరగాయలు కొనుక్కోడానికి సంతకు వెళ్లిన యువతి పర్సులో మిగిలిన డబ్బుతో ఏదైనా కొందామనుకుని ఉంగరాలు అమ్ముతున్న దుకాణం వద్దకు వెళ్లి తన దగ్గరున్న 13 డాలర్ల (రూ.900)తో ఉంగరం కొనేసింది. కొద్దిరోజుల తరువాత ఆ ఉంగరాన్ని అమ్మేస్తే ఎంత వస్తుందో చూద్దామని తాకట్టు దుకాణానికి వెళ్లింది. ఒక వారం తరువాత ఎంత వస్తుందో చెబుతామని దుకాణదారులు చెప్పడంతో యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. వారం తరువాత దుకాణం వాళ్లు ఫోన్ చేసి ఆ ఉంగరం చాలా ప్రసిద్ది చెందినదని, 19వ శతాబ్దానికి చెందిన ఉంగరమని చెప్పారు. అంతే, నిమిషం పాటు తాను వింటున్నది నిజమేనా అని యువతి ఆశ్చర్యపోయింది. ఆ ఉంగరాన్ని వేలానికి పెట్టగా.. 8.5 లక్షల డాలర్ల(రూ. 5 కోట్ల 89 లక్షల 87 వేలు)కు అమ్ముడుపోయింది.

Related posts