telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

విచిత్ర ఆచారాలు : పెళ్లికూతురు లేకుండానే .. ఘనంగా పెళ్లి..

without bride grand marriage viral

ఓ యువకుడి వివాహం గుజరాత్ లోని హిమ్మత్ నగర్ లో అంగరంభ వైభవంగా జరిగింది. పెళ్లి కుమారుడిని గుర్రంపై ఊరంతా ఊరేగించారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందంతో డ్యాన్స్ చేశారు. అయితే ఏ పెళ్లిలో అయినా ఇదే జరుగుతుంది కదా? ఇందులో గొప్ప ఏముంది? అని ఆశ్చర్యపోకండి. ఈ పెళ్లి మాత్రం స్పెషల్. ఎందుకంటే ఇక్కడ పెళ్లి కూతురు లేదు. అవును.. పెళ్లి కుమార్తె లేకుండానే ఈ వివాహ వేడుక, సంబరాలు ఘనంగా జరిగాయి. హిమ్మత్ నగర్ కు చెందిన అజయ్ బారోత్(27) మనో వైకల్యంతో బాధపడుతున్నాడు. దీనికితోడు అజయ్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే ఆయన తల్లి చనిపోయింది.

ఈ నేపథ్యంలో ఎంత వెతికినా అజయ్ కు సరైన జోడి దొరకలేదు. ఇటీవల బంధువుల పెళ్లి వేడుకకు హాజరైన అజయ్ తనకు అలా వేడుకలు జరిపి పెళ్లి చేయాలని కోరాడు. దీని తో పెళ్లి కుమార్తె లేకుండానే వేడుకలు, సంబరాలు జరిపించాలని అజయ్ తండ్రి విష్ణు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గుజరాతీ సంప్రదాయాల ప్రకారం అన్ని కార్యక్రమాలు చేశారు. గుర్రంపై అజయ్ ను ఊరేగించారు. ఈ సందర్భంగా అజయ్ చాలా సంతోషంగా గడిపాడని అతని తండ్రి విష్ణు తెలిపారు.

Related posts