telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ

అభిమానంతో.. ఓటేయడం .. సరైన నిర్ణయమేనా.. !!

Voters Registration from tomorrow |
అభిమానం-ఓటు ఈ రెంటికి లంకె ఎందుకు కుదురుతుంది. అసలు అభిమానంతో ఓటువేయడం అనేది సరైనదేనా..! నాకు పలానా వ్యక్తి మీద అభిమానం ఉంది, ఆయన రాజకీయాలలోకి వచ్చాడు, నేను ఆయనకు ఓటు వేయడం సమంజసమేనా..! దీనికోసం కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలి.. 
* అతడికి దేశం గురించి తెలుసా.. 
* అసలు దేశ అభివృద్ధి అనే దానిపై అతడికి సరైన అవగాహన ఉందా.. (అభివృద్ధి చెందిన భారతదేశం ఎలా ఉండనుంది, ప్రజల జీవన ప్రమాణాలు ఎలా ఉండనున్నాయి ఇతరత్రా.. అవగాహన ఉందా ..)
* అతడు దేశ సేవ చేయడానికి రాజకీయాలలోకి వస్తున్నాడా.. తన పరపతి మరింతగా పెంచుకునేందుకు వస్తున్నాడా.. 
* రాజకీయాలలోకి వచ్చి, దేశ నాయకుడవటం లో ఆయన లక్ష్యం ఏమిటి.. 
* ఇన్ని పార్టీలు ఉన్నప్పుడు, మరో కొత్త పార్టీ అవసరమా.. 
* పార్టీలు పెరిగి, ఓట్లు చీలి, మెజారిటీ పాతికా ముప్పై కి పడిపోతున్నప్పుడు.. ఎవరైనా గెలుస్తారు.. అయినా ఓడిపోయి, కూటమి అంటూ కొత్త రాజకీయాలు చేస్తున్నారు.. ఇవన్నీ అతడికి తెలుసా.., అయితే పరిష్కారం ఏమిటి.. 
* ఖచ్చితంగా దేశాన్ని ఇన్ని సంవత్సరాలలో అభివృద్ధి చెందిన దేశంగా చేయగలడు.. 
* దానికి ఆయన ప్రణాళికలు ఏమిటి, వాటి అమలులో సాధ్యాసాధ్యాలు ఆయనకు అవగాహన ఉన్నాయా.. 
ఇవన్నీ కనుక్కునే సమయం లేనప్పుడు, అభిమానంతో ఓటు వేయడం లో ఉపయోగం ఏమిటి. అంటే మీ ఓటు .. ప్రయోజనం లేకుండా పోతుందా ..; ప్రయోజనం ఉందని ముందు ఓటరుకు నమ్మకం ఉందా.
అభిమానం అంటే, ప్రాంతీయం కావచ్చు, రాష్ట్రీయం కావచ్చు, కులమత అభిమానం కావచ్చు, వ్యక్తి పై అభిమానం కావచ్చు, పార్టీపై అభిమానం కావచ్చు.. మరో రకమైన అభిమానం ఏదైనా కానీ, దానితో పలానా వ్యక్తికి లేదు పార్టీకి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గమ్యంలేనిదిగా చేస్తున్నది ఎవరో ఇప్పటికైనా అర్ధం అవుతుందా; ఇది అర్ధం చేసుకుంటే, దేశాభివృద్ధి ఎంత సులభమో అర్ధం అవుతుంది.
ఒక చేతి వేళ్ళ అన్ని సంవత్సరాలలో అభివృద్ధి చెందిన భారతాన్ని తయారుచేసుకోవాలని కలలు కన్న స్వాతంత్ర సమరయోధుల కలలు .. వాళ్ళ వారసులే పిచ్చి అభిమానులతో  75 ఏళ్ళైనా సాధించలేకపోయారు. దేశాన్ని చూసి ఓటేయండి, అప్పుడు కూడా ఓటు వేయాలా, వేయించుకోవాలా.. అనేది ఆలోచించండి. అంతేగాని ఎవడో, ఓటు ఏవండీ అని ప్రచారం చేయదనే, అది కూడా ఒక కల్చర్ అనుకోని ఓటు వేస్తూ పోతే మరో 500 ఏళ్ళైనా భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది.

Related posts