telugu navyamedia
సినిమా వార్తలు

మేకప్ మ్యాన్ కు బర్త్ డే విషెష్ చెప్పిన సూపర్ స్టార్

Mahesh

టాలీవుడ్ సూపర్ స్టార్ “మహర్షి”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆయన 26వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్రానికి “సరిలేరు నీకెవ్వరూ” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. మహేష్ బాబు తన సిబ్బందితో సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తున్నారు. గత పాతికేళ్లుగా ఒకే మేకప్ మ్యాన్ ను మెయింటైన్ చేస్తున్నారు. ఆయన పేరు పట్టాభి. తాజాగా, పట్టాభి జన్మదినం సందర్భంగా మహేష్ బాబు తామిద్దరూ కలిసి ఉన్న ఓ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. “హ్యాపీ బర్త్ డే పట్టాభి. మిమ్మల్ని ఎప్పటికీ ఇష్టపడతాను, మీరంటే చాలా గౌరవం” అంటూ స్పందించారు. మహేష్ పెట్టిన ఈ పోస్టుపై ఆయన అర్ధాంగి నమ్రత, వదిన శిల్పా శిరోద్కర్ కూడా కామెంట్ చేశారు. హ్యాపీ బర్త్ డే పట్టాభి గారూ అంటూ విషెస్ తెలిపారు. మహేష్ బాబు పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే 2 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

Related posts