telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

దానాలలో కూడా .. రెండో స్థానంలో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ.. !

wipro premji in 2nd place in donations and service

దానధర్మాలలో కూడా విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తన ఫౌండేషన్ ద్వారా 52,750 కోట్లు దానధర్మాలకు ఖర్చుచేస్తున్నట్టుగా తాజాగా ప్రకటించారు. దీనితో ఆయన దానాల విలువ 1.45 లక్షల కోట్లకు చేరింది. ఈ వితరణలలో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ 40 బిలియన్ డాలర్లతో ముందు ఉండగా, రెండో స్థానంలో ప్రేమ్ జీ నిలిచారు.

73ఏళ్ళ వయస్సు ఉన్న ప్రేమ్ జీ, బిల్ గేట్స్, వారన్ బఫెట్ ప్రారంభించిన ది గివెన్ ప్లెడ్జ్ ని స్వీకరించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. గేట్స్, బఫెట్ లు తమ సంపాదనలో 50 శాతం వితరణ కార్యక్రమాలకు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమ్ జీ కేటాయిస్తున్న వాటా విలువ 34 శాతంగా ఉన్నాయి.

ఇక విప్రో సంస్థకు వస్తున్న లాభాలలో 67 శాతం ప్రేమ్ జీ ఫౌండేషన్ కు వెళ్తున్నట్టుగా సీఈఓ అనురాగ్ బెహార్ తెలిపారు. ఈ ఫండ్స్ ప్రభుత్వాలు పాఠశాలలలో మెరుగైన సౌకర్యాలు, ప్రేమ్ జీ యూనివర్సిటీలో విద్యార్థులకు ప్రోత్సహకాలు, లాభాపేక్ష లేకుండా పని చేస్తున్న సంస్థలకు సాయం చేయడానికి జారీ చేస్తుంది. అలాగే పోషకాహారం, మహిళా సమస్యలు, గృహహింస, అమ్మాయల రవాణా తదితరాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న 150 వరకు సంస్థలకు తాము ఆర్థికంగా సహాయం చేస్తున్నట్టు వెల్లడించారు.

Related posts