telugu navyamedia
క్రీడలు

2019 క్రికెట్ వరల్డ్ కప్ : అందరిని ఊరిస్తున్న రికార్డు ఈసారైనా దాటేనా

April 2 specialty is 2nd world cup winning day
2019 ప్రపంచ కప్ పోటీ మరో రెండు వారాల్లో ఆరంభం కాబోతోంది. ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న ఇంగ్లాండ్‌ చివరగా 1999లో ప్రపంచకప్‌ నిర్వహించింది. ఆ టోర్నీ మొత్తంలో 300కు పైగా స్కోర్లు ఎన్ని నమోదయ్యాయో తెలుసా..? కేవలం మూడు. కానీ ఇప్పుడు 300 కంటే స్కోర్లు ప్రపంచకప్‌ మొత్తం మూడో నాలుగో నమోదైతే ఆశ్చర్య పోవాల్సిన పనేమీ లేదు. ఈ రెండు దశాబ్దాల్లో వన్డేలు అంత వేగం పుంజుకున్నాయి మరి. ఇప్పుడు 400 స్కోరు నమోదవుతున్నా.. 350కి పైగా లక్ష్యాల్ని అలవోకగా ఛేదించేస్తున్నా ఎవరికీ ఆశ్చర్యం కలగట్లేదు. ఇది మామూలు విషయమే కదా అన్నట్లు చూస్తున్నారు. ఇప్పటికే వన్డేల్లో అత్యధిక స్కోరు 481కు చేరుకుంది. ప్రస్తుత ప్రపంచకప్‌ ఆతిథ్య జట్టు, హాట్‌ ఫేవరెట్‌ ఇంగ్లాండ్‌ నిరుడు ఆస్ట్రేలియా మీద ఈ స్కోరు నమోదు చేసింది. రాబోయే ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌కు స్వర్గధామంలా కనిపిస్తున్న ఇంగ్లాండ్‌ పిచ్‌లపై 500 స్కోరు నమోదైతే ఆశ్చర్యపోవాల్సిన పని లేదేమో!
మ్యాచ్‌ అయిపోయాక అధికారిక స్కోర్‌ కార్డులు అభిమానులకు అమ్మడం ఇంగ్లాండ్‌లో ఆనవాయితీ. ఐతే ఇప్పటిదాకా 400 స్కోర్లకు తగ్గట్లుగా ఆ కార్డులుండేవట. ఐతే తాజా వాటిని ఇంగ్లాండ్‌ బోర్డు రీడిజైన్‌ చేయించిందట 500 స్కోర్లకు తగ్గట్లుగా. ప్రస్తుతం ఇంగ్లాండ్‌-పాకిస్థాన్‌ వన్డే సిరీస్‌లో నమోదైన స్కోర్లు చూశాక ఇంగ్లాండ్‌ బోర్డు ఆలోచన సరైందే అనిపిస్తుంది. ఓ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 3 వికెట్లకు 373 పరుగులు చేస్తే.. బదులుగా పాక్‌ 361 పరుగుల దాకా వచ్చింది. తర్వాత పాక్‌ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని ఇంకో 31 బంతులుండగానే ఆడుతూ పాడుతూ ఛేదించేసింది ఇంగ్లాండ్‌. 2015 ప్రపంచకప్‌ తర్వాత ఐదుసార్లు 400 పైచిలుకు స్కోర్లు నమోదవడం గమనార్హం. ప్రపంచకప్‌ అంటే మామూలుగానే బ్యాటింగ్‌కు అనుకూలంగా పిచ్‌లను సిద్ధం చేస్తుంటారు. ఇక ఇంగ్లాండ్‌ పిచ్‌ల సంగతి తెలిసిందే. 300 అక్కడ చిన్న స్కోరైపోయింది. పిచ్‌లకు తోడు భారీ షాట్లు ఆడటానికి మరింతగా సహకరిస్తున్న బ్యాట్లు, బౌలర్లకు ప్రతికూలంగా మారిన ఫీల్డింగ్‌ నిబంధనలు భారీ స్కోరు అవకాశాల్ని మరింత పెంచేవే. వన్డేల్లో పవర్‌ ప్లే వరకు కొంచెం వేగంగా ఆడుకుని.. మధ్య ఓవర్లలో నెమ్మదించి.. చివర్లో మళ్లీ దూకుడు పెంచే రోజులు పోయాయి. టీ20ల ప్రభావంతో వన్డేల్లోనూ దూకుడు బాగా పెరిగింది. ఈ రోజుల్లో ఎంత స్కోరైనా సురక్షితం కాదు కాబట్టి ఏ దశలోనూ దూకుడు తగ్గించకుండా బాదడమే చేస్తున్నారు బ్యాట్స్‌మెన్‌. క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాట్స్‌మన్‌ కుదురుకునే వరకు ఆచితూచి ఆడట్లేదు. తొలి బంతి నుంచే బాదేస్తున్నాడు. కాబట్టి బ్యాటింగ్‌కు స్వర్గధామాలుగా మారిన బ్రిస్టల్‌ లాంటి మైదానాల్లో 500 స్కోర్ రికార్డు అవుతుందేమో చూడాలి..!

Related posts