telugu navyamedia
క్రీడలు వార్తలు

సౌథాంప్టన్‌లో ఎల్లో వెదర్ వార్నింగ్…

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ మొత్తానికీ వరుణుడి గండం పొంచి ఉంది. వాతావరణం అనుకూలించే సందర్భాలు చాలా పరిమితంగానే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో పరిమితంగా మాత్రమే తప్ప- పూర్తిగా మ్యాచ్ సాగే అవకాశాలు ఎంత మాత్రమూ లేవు. దీనికి ప్రధాన కారణం- ఈ చారిత్రాత్మక మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న సౌథాంప్టన్‌లో వచ్చే వారం రోజులూ వర్షం పడే అవకాశం ఉన్నట్లు బ్రిటన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. సౌథాంప్టన్‌లో వచ్చే ఆరు రోజులూ వర్షాలు పడొచ్చంటూ బ్రిటన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో వెదర్ వార్నింగ్ ను జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని స్పష్టం చేసింది. సౌథాంప్టన్ మొత్తంగా ఓ మోస్తరు నుంచి భారీ, అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వచ్చే వారం రోజులూ ఇదే తరహా వాతావరణం సౌథాంప్టన్‌లో ఉండటానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం- 16 డిగ్రీల ఉష్ణోగ్రతతో వర్షం కురుస్తోన్నట్లు తెలిపింది..

Related posts