telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

బిగ్ బాస్ లోకి .. స్టార్ నటి… వైల్డ్ కార్డుతో నట..

wild card entry into bigg boss 3 to sradha das

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న క్రేజీ షో బిగ్ బాస్ ప్రస్తుతం విపరీతమైన ప్రేక్షకాభిమానంతో, అలానే మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. గతంలో జరిగిన రెండు సీజన్ల కంటే ఈ సీజన్ ను మరింత సక్సెస్ చేసేలా, షో నిర్వాహకులు మరిన్ని సరికొత్త పద్ధతులు ఈ సీజన్ లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ వారం ఎలిమినేషన్ జోన్ లోకి ఆరుగురు సభ్యులు ఎంటర్ అవడం, వారిలో ఒకరైన యాంకర్ శ్రీముఖి స్థానంలో బిగ్ బాస్ ద్వారా నియమితమైన మెంటర్ హేమ, మరొక పార్టిసిపెంట్ హిమజ పేరును ప్రకటించడం నిన్నటి ఎపిసోడ్ లో చిన్నపాటి వివాదాల మధ్య జరిగిపోయింది.

ఈ వారం పూర్తి అయ్యేసరికి ఎవరు హౌస్ నుండి ఎలిమినేట్ కాబడతారు అనే దానిపై పలు మీడియా మాద్యమాల్లో ఇప్పటికే విపరీతంగా చర్చ జరుగుతుంది. ఈ సీజన్ లో రాబోయే వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హీరోయిన్ శ్రద్ధ దాస్ బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నట్లు నేడు విపరీతంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే కొందరు గ్లామర్ బ్యూటీలతో కళకళలాడుతున్న బిగ్ బాస్ హౌస్‌కి మరింత గ్లామర్ తీసుకురావాలనే ఆలోచనతోనే ఈ హాట్ సెక్సీ బ్యూటీని ఎంటర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట నిర్వాహకులు. మరి ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మరికొద్దిరోజలు వెయిట్ చేయాల్సిందే….!!

Related posts