telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అత్యంత చెత్త షో… బిగ్ బాస్ పై హీరోయిన్ ఫైర్

Kasturi

వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ దేశంలోని ప్రాంతీయ భాష‌ల‌లో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. అప్పుడప్పుడూ ట్విట్టర్‌ ద్వారా సంచలన వ్యాఖ్యలను చేస్తూ వార్తలకెక్కే కస్తూరి ఈసారి బిగ్‌బాస్‌ షోపై ఘాటుగా స్పందించింది. బిగ్‌బాస్‌ 3వ సీజన్‌లో వైల్డ్‌ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి, అంతే త్వరగా బయటకే వచ్చేసింది కస్తూరి. ఆమెకు ఆ ఇంటిలో వున్న కెవిన్‌ గ్రూప్‌కు సరిగా పడేది కాదు. కస్తూరిని ఆ గ్రూప్‌ సభ్యులు కాకి అంటూ పలు విధాలుగా విమర్శించేవారు. ఆ సమయంలో ఆమెకు దర్శకుడు చేరన్‌, మధుమితలు ఆసరాగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఆదివారం చేరన్‌ బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆయనకు తక్కువ ఓట్లు వచ్చాయని కమల్‌హసన్‌ చెప్పడంతో చేరన్‌ బయటకు రావలసివచ్చింది. అయితే ఆయన కంటే లాస్లీయాకే తక్కువ ఓట్లు వచ్చాయని రెండు రోజులుగా సోషల్‌ మిడియాలో వార్తలు వచ్చాయి. బిగ్‌బాస్‌ నిర్వాహకులు, విజయ్‌ టివి కావాలనే కెవిన్‌, లాస్లీయాల మధ్య లవ్‌ సన్నివేశాలను పెట్టి ప్రేక్షకులకు రక్తి కట్టించి టీఆర్పీని పెంచుకునేందుకే ఇలా చేశారని నెటిజన్లు వాపోతున్నారు. లాస్లీయా గురించో లేక వారి కుటుంబం గురించో విజయ్‌ టివీ నిర్వాహకులకు అవసరం లేదని, వారికి అవసరమైనది టీఆర్పీ రేటింగ్‌ మాత్రమేనని నెటిజన్లు దుమ్మెత్తి పొస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన నటి కస్తూరి తనను నిరాశపరిచిన అత్యంత మోసమైన షో ఇదేనని ట్విట్‌ చేసింది. అయితే బిగ్‌బాస్‌ అన్న పేరు మాత్రం వాడకపోవడం గమనార్హం.

Related posts