telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్‌లో దారుణం.. భార్యా, కుమారుడిని చంపిన కిరాతకుడు

New couples attack SR Nagar

కన్న కొడుకును, కట్టుకున్న భార్యను అతి దారుణంగా ఓ కిరాతకుడు హత్య చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఎన్టీఆర్‌ నగర్‌లో చోటు చేసుకుంది. మొదట భార్యను ఉరి వేసి చంపిన ఆ కిరాతకుడు, అనంతరం తన కుమారుడికి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని చికిత్స నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి కుమారుడి వయసు ఏడాదిన్నర ఉంటుందని వివరించారు. ఆ వ్యక్తి ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డాడన్న విషయం గురించి తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts