telugu navyamedia
ట్రెండింగ్

భార్య, భర్త, మధ్యలో కుక్క’లు’…కట్ చేస్తే..

wife gave divorce just for dogs

మూగజీవాలను కుటుంబంలో ఒకటిగా భావించే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి ఇంటిలో పిల్లో, కుక్కో, మరొక జీవి .. పెంపుడు జంతువుగా ఉంటుంది. కొందరి ఇళ్లలో వీటి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే ఆ ఇంటిలో అందరికి ఇష్టమైతే అంతా బాగానే ఉంటుంది.. లేదంటేనే అసలు సమస్య. ఇక పెంపుడు జీవులు 30 వరకు ఉంటే, ఈ సందర్భంలో ఆ ఇంట్లో వారికి అది ఇష్టం లేకుంటే.. పరిస్థితి ఊహించగలరా.. అదికూడా వారిద్దరూ బార్యాభర్తలైతే.. ఇంకేముంది విడాకులే అంటారు కదా. సరిగ్గా చెప్పారు. ఇక్కడ ఒక భార్య కూడా అదే చేసింది. ఎప్పుడో ‘జాలి లేని కొడుకు కంటే కుక్క మేలురా’ అన్నాడో సినీ కవి. అక్షరాలా ఆమె అలాగే అనుకుంది. జాలి లేని భర్త కంటే కుక్కలే మేలని అతనితో తెగతెంపులు చేసుకుంది. తన పెంపుడు కుక్క కోసం ఏకంగా జీవిత భాగస్వామినే వదులుకుందో మహిళ.

ఇంగ్లండ్‌లోని బ్రన్హమ్‌కు చెందిన లిజ్‌కు చిన్నప్పటి నుంచి కుక్కలంటే ప్రాణం. బాల్యం నుంచి వాటితోనే గడిపింది. ఆమె తండ్రి పశువుల ఆహారాన్ని అమ్మేవారు. పదహారేళ్ల వయసులో మైక్‌ హస్లమ్‌ ప్రేమలో పడిన లిజ్‌ అతని కోసం తన తల్లిదండ్రులను కూడా కాదనుకుంది. 1991లో లిజ్‌, మైక్‌లు పెళ్లి చేసుకుని బ్రన్హమ్‌లో వేరు కాపురం పెట్టారు. ఆ తర్వాత లిజ్‌ కుక్క పిల్లల వ్యాపారం మొదలు పెట్టింది. ప్రస్తుతం వీరికి 22 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. తొలి రోజుల్లో ఒకటి రెండు కుక్కల్ని పెంచేది. దీనితో మైక్‌ పెద్దగా పట్టించుకునేవాడు కాదు.

రానురాను ఇంట్లో కుక్కల సంఖ్య పెరుగుతుండడంతో అతనిలో అసహనం కూడా పెరిగి పోయింది. లిజ్‌ ప్రస్తుతం 30 కుక్కల్ని సేకరించి ఇంట్లో పెంచుతోంది. దీన్ని తట్టుకోలేక పోయిన మైక్‌ ఓ రోజు నేను కావాలో, కుక్కలు కావాలో తేల్చుకోవాలని భార్యకు అల్టిమేటమ్‌ ఇచ్చాడు. భర్త మాటలతో హతాశురాలైన లిజ్‌ మరో మాటకు తావివ్వకుండా ‘నాకు కుక్కలే కావాలి. కావాలంటే నీవు బ్యాగు సర్దుకుని బయటకు పో’ అని తెగేసి చెప్పేసింది. దీనితో చేసేది లేక మైక్‌ బ్యాగు సర్దుకుని బయటకు వెళ్లిపోయాడు.

Related posts