telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్రేమను తట్టుకోలేకుండా ఉన్నాను .. విడాకులు ఇప్పించండి .. : ఓ భార్య

strange reasons for getting divorce

విడాకులకు వింత కారణాలు, తాజాగా, షార్జాకు చెందిన జంటకి ఏడాది క్రితం వివాహమైంది. ఆమె విడాకులు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తనకు భర్తతో ఎటువంటి గొడవలు లేవని, అతడి ప్రేమ, మంచితనాన్ని తాను తట్టుకోలేకపోతున్నానని కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో పేర్కొంది. పెళ్లైన తర్వాత ఒక్క రోజు కూడా తమ మధ్య గొడవ జరగలేదని తెలిపింది. ఆయనతో గొడవ పడకుండా అతడి ప్రేమను భరిస్తూ ఉండడం నరకంలా ఉందని, ఎలాగైనా తనకు విడాకులు ఇప్పించాలని కోరింది. ఆమె పిటిషన్ చూసిన కోర్టు తెల్లబోయింది.

ఆమె విడాకుల పిటిషన్‌పై కోర్టు భర్తను ప్రశ్నించింది. భార్య అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమెతో తాను గొడవపడలేనని తేల్చి చెప్పాడు. ఒకసారి ఆమె తాను బరువు తగ్గాలని చెప్పిందని, దీంతో కఠినమైన డైట్‌తో తగ్గానని వివరించాడు. ఆమెతో గొడవ పడడం తన వల్ల కాదని స్పష్టం చేశాడు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవాలంటూ తీర్పును వాయిదా వేశారు. ఏడాది వ్యవధిలోనే భార్యాభర్తల సంబంధాలపై ఓ అవగాహనకు రాలేమని కోర్టు స్పష్టం చేసింది.

Related posts