telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ సినిమా వార్తలు

జాక్వెలిన్ ఫెర్నాండేజ్, విక్కీ కౌశల్ వరస్ట్ కో-స్టార్స్… తాప్సి వ్యాఖ్యలు

Tapsi

తెలుగులో “ఝుమ్మంది నాదం” సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి తాప్సీ ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశాలను చేజిక్కించుకుని స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. అయితే ఈ మిల్కీ బ్యూటీకి కెరీర్ ప్రారంభంలో స‌క్సెస్ అంత ఈజీగా దొర‌క‌లేదు. చాలా క‌ష్ట‌న‌ష్టాల‌ను చవిచూడాల్సి వచ్చింది తాప్సీ. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది తాప్సీ. ఇటీవలే “గేమ్ ఓవర్” చిత్రంతో తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న తాప్సి ఇప్పుడు గుజరాత్‌కు చెందిన రష్మీ అనే అథ్లెట్ పాత్రలో ఆమె కనిపించబోతున్నది. తాప్సీ ప్రధాన పాత్రలో “రష్మీ రాకెట్” పేరుతో ఓ బాలీవుడ్ చిత్రం తెరకెక్కుతున్నది. ఆకర్ష్ ఖురానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రోనీ స్క్య్రూవాలా నిర్మిస్తున్నారు. ఇటీవలే `పింక్`, `మిషన్ మంగళ్` వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నేహా ధూపియా నిర్వహించే కార్యక్రమానికి తాజాగా హాజరైన తాప్సీ… ఆ కార్యక్రమంలో `ఇప్పటివరకు నీతో కలిసి నటించిన వారిలో వరస్ట్ ఎవరు` అంటూ తాప్సీని నేహా ప్రశ్నించింది. దానికి వెంటనే తాప్సీ తడుముకోకుండా జాక్వెలిన్ ఫెర్నాండేజ్, విక్కీ కౌశల్ పేర్లు చెప్పింది. `జాక్వెలిన్‌తో కలిసి నటించే సమయంలో ఆమెలా అందంగా, గ్లామరస్‌గా కనిపించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చేది. అందుకే ఆమె నా వరస్ట్ కో-స్టార్. అలాగే విక్కీ కౌశల్‌తో నటించడం చాలా కష్టం. అందుకే అతను కూడా నా వరస్ట్ కో-స్టార్` అని చెప్పింది. నేహా అడిగిన వివాదాస్పద ప్రశ్నకు తాప్సీ అద్భుతంగా జవాబు చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Related posts