telugu navyamedia
culture health Sexual Problems

పోర్న్ చూస్తూ శృంగారం చేస్తున్నారా ?

Sex

ఇటీవల కాలంలో ఇంటర్నెట్ వినియోగం చాలా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారు. సాధారణంగా చాలా మంది పోర్న్ వీడియోలు చూస్తారు. అయితే కొంతమంది పురుషులు మాత్రం శృంగారం చేసేటపుడు కూడా పోర్న్ చూస్తూ చేస్తుంటారన్న ఫిర్యాదులు వైద్యుల వద్దకు ఎక్కువగా వస్తున్నాయి. శృంగారంలో పాల్గొంటున్నప్పుడు పోర్న్ చూస్తారే తప్ప… అటువైపున్న భార్యను పట్టించుకోరు. ఇలాంటి ప్రవర్తన వల్ల భార్యల్లో భర్తతో సెక్స్ అంటే విముఖత ఏర్పడుతుంది. ఒకవేళ తమ జీవిత భాగస్వామికి చెప్పినా ఏమనుకుంటారననే ఉద్దేశ్యంతో అలాగే భరిస్తుంటారు కొంతమంది భార్యలు.

అయితే యుక్త వయస్సులో ఉండే యువతీ యువకులు ఇలాంటి వీడియోలు చూడడం సాధారణమే… కానీ మరీ ఎక్కువగా అందులో లీనం కాకూడదన్న విషయాన్నీ గమనించాలి. అలాగే చేస్తున్నారంటే తమకు నచ్చినవారితో శృంగారం చేస్తున్నట్టు ఊహించుకుంటారు. అయితే ఈ విషయంలో మితిమీరిపోయి పోర్న్ కు బానిసలుగా మారిపోతే… వారితో కాస్త కఠినంగా ప్రవర్తించడంలో తప్పులేదు. అలాంటివి ఇష్టం లేదని సున్నితంగా చెప్పండి. అప్పటికీ వినకపోతే వారికి కౌన్సెలింగ్ కు తీసుకెళ్ళండి. శృంగారంలో జీవిత భాగస్వామికి తగిన ప్రాధాన్యతను ఇవ్వాలి. అసలు పడకగదిలో పోర్న్ చూడడం మానెయ్యడం మంచిది.





Related posts

పంజాగుట్ట నుంచి 47 బస్ ఎక్కాలంటే.!

vimala p

నవ్వు నాలుగు విధాలా … జ్ఞాపకశక్తి… అంటున్న అధ్యయనాలు…

vimala p

ఈ రోజు మీ జాతకం ఎలా ఉందొ చూడండి.

ashok