telugu navyamedia
health Sexual Problems study news

శృంగారంలో పురుషుడు స్త్రీపై ఆసక్తిని ఎందుకు కోల్పోతాడంటే…

Participating in sex for seven hours a day .... She is dissatisfied

కొంతమంది పురుషులు పడక గదిలో తమ భార్యలతో శృంగారం చేయడానికి అంతగా ఆసక్తిని చూపించరు. అలాంటి సమయంలో తన భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడేమో అని అనుమానపడుతుంది భార్య. అందుకే తన భర్త తనపై ఆసక్తిని చూపడం లేదని భర్తను నిందిస్తుంది. దీంతో ఇద్దరి మధ్య మెల్లమెల్లగా దూరం పెరుగుతుంది. సాధారణంగా మహిళలు మధ్య వయసులోకి రాగానే పిల్లల ఆలోచనలు, వారి పెంపకం, చదువులు, ఇంటి పని, ఆఫీస్ పని వంటి వాటితో చాలా బిజీగా ఉంటారు. అప్పుడు భర్తకు తగినంత సమయాన్ని కేటాయించకపోవచ్చు. అంతేకాదు హార్మోన్ల మార్పుల వల్ల కూడా శృంగారంలో కాస్త ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. దీంతో మహిళలు పెళ్ళైన కొత్తలో ఉన్నట్టుగా అందంగా తయారవ్వడంపై దృష్టి పెట్టడం తగ్గిపోతుంది. భార్యపై భర్తకు అనాసక్తత పెరగడానికి ఇది కూడా ఒక కారణం. ఇక పడక గదిలో ఎప్పుడూ రొటీన్ పద్ధతులను పాటించడం కూడా భార్యపై భర్త అయిష్టతను కారణం అవుతుంది.

ఇలాంటి సమయంలో భార్యాభర్తలు మొహమాటపడకుండా ఒకరితో ఒకరు ఈ విషయం గురించి మాట్లాడుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకుని తదనుగుణంగా నడుచుకోవాలి. అంతేతప్ప అనవసరంగా ఒకరినొకరు నిందించుకొని దాంపత్య జీవితాన్ని మరింత బలహీనం చేసుకోకూడదు. తదనుగుణంగా నడుచుకోవడం వల్ల దాంపత్య జీవితాన్ని ఆనందంగా మలుచుకోవచ్చు.




Related posts

హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో .. కరోనా వార్డు..

vimala p

చుండ్రు కి .. ఇలా చెక్ పెట్టండి…

vimala p

టీజీటీ పోస్టులకు బీటెక్‌ వారూ అర్హులే: హైకోర్టు

vimala p