telugu navyamedia
రాజకీయ

ఉగ్రవాదం విషయంలో చైనా వ్యూహం ఎందుకు మార్చుకుందంటే …?

Why China's strategy for terrorism changes
ఇప్పుడు సర్వత్రమ్ ఎదురవుతున్న ప్రశ్నలు ఇవి . ఇంతకాలం అమెరికా నుంచి భారత్ వరకు గొంతు చించుకుంటూ అరుస్తున్నా చైనా పెదవి విప్పలేదు. .పైగా ఐక్యరాజ్య సమితిలో అజర్ ను ఉగ్రవాదిగా ప్రకటించడానికి మద్దతు ఇవ్వలేదు . మరి ఇప్పుడు చైనా తన వ్యూహాన్ని మార్చుకొని అజర్ అంతర్జాతీయ ఉగ్రవాదేనని అంగీకరించి ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితికి తెలిపింది  అంతర్జాతీయ ఉగ్రవాది జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను నిషేదించాలని చైనా అంగీకరించడం భారత్ దౌత్య  విజయంగా  చెప్పవచ్చు . 
Why China's strategy for terrorism changes
మన పొరుగు దేశం పాకిస్తాన్ విభజన నాటి నుంచి మనకు పక్కలో బల్లెం లా ఉంటూ … ప్రత్యక్షంగా , పరోక్షముగా ఉగ్రమూకలకు ఆశ్రయం ఇచ్చి , ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది . ఈ ఉగ్రవాదంతో ఎన్నో దేశాలు వణికి పోతున్నాయి . అమెరికా లాంటి దేశం కూడా ఉగ్ర బాధిత దేశమే. . అందుకే అమెరికా మొదలు అన్ని దేశాలు మహ్మద్ అజర్ పై నిషేధం విధించాలని నినాదిస్తున్నా .. చైనా మాత్రం కలసి రాలేదు . ఇయితే ఇప్పుడు శ్రీలంకపై ఉగ్రదాడి జరిగి వందలమంది మృత్యువాత పడిన తరువాత చైనా ఉలిక్కి పడింది . కారణం శ్రీలంకతో గత కొన్నాళ్లుగా చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్  శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో స్నేహం చేస్తున్నాడు  . వ్యాపార లావాదేవీలతో పాటు ఆ దేశంలో చైనా తన సైనిక స్థావరం కూడా ఏర్పాటు చెయ్యాలని అనుకుంది . చైనా నుంచి ఆర్ధిక సహాయం పొందుతున్న శ్రీలంక అందుకు సమ్మతించింది . 
Why China's strategy for terrorism changes
పాకిస్తాన్ ఎప్పటి నుంచో చైనా మిత్ర దేశం . పాకిస్తాన్ దేశాన్ని తన వ్యాపార కార్యకలాపాల విస్తరణకు వాడుకుంటుంది . పాకిస్తాన్ కూడా భారత్ దేశాన్ని ఢీకొనాలంటే చైనా లాంటి దేశం అండ ,దండా అవసరం . అందుకే పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో టచ్ లో ఉంటాడు పైగా పాకిస్తాన్ ఎప్పుడు సహాయం కోసం ఇతర దేశాల  మీదా ఆధారపడుతుంది . 
అమెరికాలో ఉగ్రదాడి జరిగిన తరువాత అమెరికా పాకిస్తాన్ దూరం పెడుతుంది . డోనాల్డ్ ట్రంప్ ఆర్ధిక సహాయం కూడా బాగా తగ్గించి ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ నుంచి తరిమేయ్యమనివార్నింగ్ కూడా ఇచ్చాడు . ఇదే సమయంలో చైనా పాకిస్థాన్ కు అభ్య హస్తం ఇచ్చింది . ఉగ్రవాదులు అక్కడ  చెలరేగిపోతున్నారని చైనాకు తెలుసు. చైనా సరి హద్దులోనే పాకిస్తాన్ వుంది . అయినా ఇంతకాలం చైనా ఉగ్రవాదం విషయంలో అంతర్జాతీయ సమాజంతో కలసి రాలేదు . 
Why China's strategy for terrorism changes
మరి ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు తన నిర్ణయాన్ని మార్చుకుంది . శ్రీలంకలో దాడి చేసింది ఐసిస్  అనే ఉగ్ర సంస్థ . దీనికి జైషే  మహమ్మద్ సంస్థ కు సంబంధాలున్నాయి . ఇది అందరికీ తెలిసిన విషయమే . శ్రీలంకలో తన వ్యాపార స్థావరంతో పాటు రాజకీయ అడ్డాగా చేసుకోవాలని చైనా చూస్తున్న తరుణంలో ఉగ్ర దాడి జరిగింది . మానవ బాంబులు శ్రీలంకను కోలుకోలేని దెబ్బతీశాయి . ఈ ఘటన తరువాత చైనా తన మీద దాడి చేసినట్టు భావించింది . ఇంతకాలం పాకిస్తాన్ దేశాన్ని మిత్ర దేశంగా భావించింది . ఆ మిత్ర దేశంలో వున్న ఉగ్ర వాదులు ఎప్పటికైనా చైనా మీద కూడా దాడి చెయ్య వచ్చునని భయపడింది .  
Why China's strategy for terrorism changes
అందుకే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా  మహమ్మద్ అజర్ ను నిషేదించాలని ఐక్యరాజ్య సమితికి లేఖ రాసింది .ఐక్యరాజ్య సమితి వెంటనే అజర్ పై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది . ఐక్యరాజ్య సమితిపై  అమెరికా చేస్తున్న వత్తిడి, ఉగ్రవాదంపై రాజీలేని పోరు చేస్తూ అనేక దేశాలను వప్పించిన భారత్ , ఇప్పుడు చైనా అంగీకారంతో ఐక్యరాజ్య సమితి అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ నిషేధం విధించింది . ఇప్పుడు పాకిస్తాన్ మెడకు వురి బిగించారు . 
Why China's strategy for terrorism changes
తన దేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమి వెయ్యాలి . దేశంలో తలదాసుకున్న అజర్ ను అప్పగించాలి . పాకిస్థాన్ కు వేరే దారి లేదు.  ఇది భారత్ దేశానికి కలసి వచ్చిన అంశం . ఇంతకాలం చేసున్న పోరాటం ఫలించింది . ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు . ఐక్యరాజ్య సమితి చర్య భారత ఉపఖండం లో శాంతిని కలిగిస్తుందని ఆశిద్దాము . 
-భగీరథ  

Related posts