telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా రోగులపై ట్రయల్స్ నిలిపివేయాలి: డబ్ల్యూహెచ్ ఓ

who modi

కరోనా రోగులపై పై ట్రయల్స్ నిలిపివేయాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( డబ్ల్యూహెచ్ ఓ ) కీలక నిర్ణయం తీసుకుంది. పేషంట్లపై మలేరియా డ్రగ్ హైడ్రాక్సీ క్లోరోక్విన్, హెచ్ఐవీకి వాడే లోపినావీర్ ను వాడుతూ నిర్వహిస్తున్న ట్రయల్స్ ను నిలిపి వేయాలని సూచించింది. ఈ డ్రగ్ వాడుతున్న పేషంట్లలో ఏ మాత్రమూ మరణాల రేటు తగ్గకపోవడంతో డబ్ల్యూహెచ్ఓ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని తెలుస్తోంది.

క్లినికల్ ట్రయల్స్ లో మధ్యంతర నివేదికలు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మరియు లోపినావీర్ / రెటోనావీర్ లు ఆసుపత్రుల్లో ఉన్న వారికి ఏ మాత్రమూ ఉపశమనం చేకూర్చలేకపోయాయి. మరణాల శాతాన్నీ తగ్గించలేకపోయాయి. ఇతర ఔషధాలతో పోలిస్తే ఇవి పెద్దగా ప్రయోజనాన్ని చూపలేదు. దీంతో తక్షణమే ట్రయల్స్ నిలిపివేయాలని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించినట్టు ‘అల్ జజీరా’ పేర్కొంది.

Related posts