telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

భారత్ లో  కరోనా విజృంభించవచ్చు: డబ్ల్యూహెచ్ఓ 

who modi

భారత్ లో లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో కరోనా విజృంభించవచ్చని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. తొలుత భారత్ తీసుకున్న చర్యలతో వైరస్ వ్యాప్తి కట్టడి జరిగిందని, కానీ దేశంలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, ఇలాంటి తరుణంలోనే కరోనా వైరస్ తీవ్ర రూపు దాల్చుతుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ మైకేల్ ర్యాన్ తెలిపారు.

భారత్ లో జనసాంద్రత ఎక్కువ అని, ఉపాధి కోసం ప్రజలు భారీ సంఖ్యలో కూలి పనులకు వెళుతుంటారని, వైరస్ వ్యాప్తి చెందడానికి ఇలాంటి పరిస్థితులే అత్యంత అనుకూలమని వివరించారు. లాక్ డౌన్ క్రమంగా ఎత్తివేస్తున్న తరుణంలో వైరస్ కట్టడి ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితి మాత్రం ఉధృతంగా లేదని పేర్కొంది. అయితే, లాక్ డౌన్ సడలింపులతో ఏ సమయంలోనైనా కరోనా వైరస్ విరుచుకుపడే అవకాశముందని వెల్లడించింది.

Related posts