telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ప్రపంచవ్యాప్తంగా ఎమర్జెన్సీ .. ఎబోలా వైరస్‌ విజృంభన … : ప్రపంచ ఆరోగ్య సంస్థ

WHO emergency on ebola virus

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), కాంగోలో ఎబోలా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీని ప్రకటించింది. ఎబోలా వైరస్‌ కాంగోలోని గోమాకు విస్తరించిందంటూ కాంగో ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించడంతో డబ్ల్యూహెచ్‌ఒ ఈ ప్రకటన చేసింది. ఇంటర్నేషనల్‌ హెల్త్‌ రెగ్యులేషన్స్‌ ఎమర్జెన్సీ కమిటీ జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

గత ఏడాది ఈ వైరస్‌ మూడు సార్లు వ్యాప్తి చెందడంతో అంతర్జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. 2018 ఆగస్టులో ఈ వైరస్‌ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటి వరకూ 1,600 మంది మృత్యువాత పడ్డారు. మొదటిసారి 2014లో పశ్చిమ ఆఫ్రికాలో ఈ వైరస్‌ను గుర్తించినప్పుడు అంతర్జాతీయ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు.

Related posts