telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్రేయసి ఫేస్ బుక్ లో లైక్ కొట్టిందని అతడు ఏం చేశాడంటే…!?

SIT Investigation YS viveka Murder

కెంట్‌లోని వైట్‌స్టేబుల్‌లో నివాసముండే డానీ బ్రిడ్జెస్త అనే 35 ఏళ్ళ వ్యక్తి థన్ గర్ల్‌ఫ్రెండ్ పట్ల భయంకరంగా ప్రవర్తించాడు. వృత్తిరీత్యా బాడీబిల్డర్ అయిన డానీ ఇతరుల పోస్టులకు నీవు లైక్ కొట్టడం ఏంటని ప్రేయసిని ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. ఆ తరువాత యువతిని కిందపడేసి తన బొటన వేలితో ఆమె కళ్లను పెకిలించేందుకు యత్నించాడు. గతేడాది ఏప్రిల్, నవంబర్ మాసాల్లో రెండుసార్లు ఇలా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అతడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి తన స్నేహితులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారం మేరకు కెంట్ పోలీసులు డానీ ఇంటికి వచ్చారు. తన కోసం పోలీసులు రావడం గమనించిన అతడు ఇంటి తలుపులు తీసేందుకు నిరాకరించాడు. దాంతో పోలీసులు బలవంతంగా తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి డానీని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు తాజాగా కాంటర్బరీ క్రౌన్ కోర్టులో విచారణకు వచ్చింది. దీంతో కోర్టు యువతి పట్ల అమానుషంగా ప్రవర్తించిన డానీకి తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

Related posts