telugu navyamedia
రాజకీయ వార్తలు

ట్రంప్ అడ్రస్ తో విషం పూసిన లెటర్..వైట్ హౌస్ లో కలకం!

white house usa

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్రస్ తో విషం పూసిన లెటర్ రావడం వైట్ హౌస్ లో కలకం రేపింది. దీన్ని ముందే గుర్తించిన అధికారులు, అది లక్ష్యాన్ని చేరకుండా నిలిపివేశారు. దీనిపై దర్యాఫ్తు చేస్తున్నామని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అత్యంత ప్రమాదకరమైన రిసిన్ విషం పూసిన లేఖ ఒకటి డొనాల్డ్ ట్రంప్ పేరిట వాషింగ్టన్ లోని శ్వేతసౌధం చిరునామాతో రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లేఖ కెనడా నుంచి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ లేఖ వైట్ హౌస్ కు చేరకముందే మెయిల్ సెంటర్ లోనే అధికారులు గుర్తించారని ‘సీఎన్ఎన్’, ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. ఈ వ్యవహారంపై యూఎస్ సీక్రెట్ సర్వీస్ లు స్పందించేందుకు నిరాకరించాయి.

ఈ లేఖపై పూసిన రిసిన్, అత్యంత ప్రమాదకరమైనదని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు వెల్లడించారు. దీన్ని జీవాయుధంగా కూడా వినియోగించవచ్చని పేర్కొన్నారు. దీన్ని తీసుకున్న 36 నుంచి 72 గంటల్లోగా మరణం తప్పదని తెలిపారు. ఈ విషానికి ఇంతవరకూ యాంటీ డోస్ కనుగొనబడలేదని వెల్లడించారు.

Related posts