telugu navyamedia
సినిమా వార్తలు

“వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మీ” మా వ్యూ

mass song from where is venkatalakshmi movie
చాలా రోజుల తరువాత రాయ్ లక్ష్మీ తెలుగులో నటించిన చిత్రం “వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మీ”. అదికూడా హార్రర్ అండ్ కామెడీ థ్రిల్లర్ కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెరిగింది. అంతేకాదు లక్ష్మి రాయ్ మెరుపుతీగలా సన్నగా మారిపోయి గ్లామర్ డోస్ కూడా పెంచేసింది. అంతేకాకుండా టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో సినిమా కాస్తా ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన “వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మీ” ఎలా ఉందో చూసేద్దాం. 
కథ :
చంటిగాడు (ప్రవీణ్) పండుగాడు (మధు) ఇద్దరూ స్నేహితులు, బేవార్స్ గా తిరుగుతుంటారు. వాళ్ల చేసే పనులకు వాళ్ల ఊళ్లో వాళ్ళు విసిగిపోయి ఉంటారు. ఓ రోజు వాళ్ళ ఊరుకి వెంకట లక్ష్మి (లక్ష్మీరాయ్) అనే టీచర్ వస్తుంది. బస్‌ దిగగానే సాయం చేయమని చంటి, పండులను అడుగుతుంది. వీళ్లు వెంటనే ఆమెకు కనెక్ట్ అయిపోయి పోటీపడి మరీ ఆమె ఊళ్లో ఉండటానికి ఏర్పాట్లు చేస్తారు. అంతేకాదు ఇద్దరిలో ఎవరో ఒకరు వెంకటలక్ష్మీని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి, ఆమెను మెప్పించడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే వారికి తాము ఇష్టపడుతున్న వెంకటలక్ష్మి మనిషి కాదు దెయ్యం అని తెలుస్తుంది. అదే సమయంలో వెంకటలక్ష్మీ ఓ మాఫియా బ్యాచ్ నుంచి తనకు కావాల్సిన ఓ బాక్స్ ను తెచ్చివ్వమని వాళ్ళను అడుగుతుంది. పండు, చంటి ఇద్దరూ వెంకటలక్ష్మి నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం ఆ బాక్స్ తీసుకురావడానికి సిద్ధపడి బయలుదేరతారు. అంతకుముందే మాఫియా నాయకుడు ఆ బాక్స్ కోసం ఆడిటర్ (బ్రహ్మాజీ) కుటుంబాన్ని చంపేస్తాడు. చంటి, పండు ఆ బాక్స్ తెస్తారా ? అసలు ఆ బాక్స్ లో ఏముంది ? వెంకటలక్ష్మి వాళ్లకు మాత్రమే ఎందుకు కన్పిస్తుంది. అసలు వెంకట లక్ష్మీ గతమేంటి ? అనేవి వెండి తెరపై వీక్షించాల్సిందే.   
నటీనటులు : రొటీన్ కథే… దర్శకుడు కథను సీరియస్ గా తీసుకోలేదు. తనకు వచ్చిన ఆలోచనలను కలుపుకుంటూ పోయాడేమో అన్పిస్తుంది. ప్రవీణ్, మధుల కామెడీ పెద్దగా పేలలేదు. కథలో కేవలం డైలాగ్ కామెడీ తప్ప సిట్యువేషన్ కామెడి లేదు. ఇలాంటి సినిమాలకు అదే ముఖ్యం. హారర్, కామెడీతో పాటు మధ్యలో అడల్ట్ కామెడీకి ప్రయత్నం  చేసాడు. అదికూడా పీక్స్ కు వెళ్లలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండాఫ్ నెమ్మదిగా సాగింది. క్లైమాక్స్ అయితే మరీ సినిమాటిక్ గా క్లోజ్ చేసారు. రాయ్ లక్ష్మీ గ్లామర్ షోనే సినిమాకు ప్లస్ పాయింట్. 
సాంకేతిక వర్గం పనితీరు :
సినిమాలో చెప్పుకోదగ్గ విషయం హరి గౌర సంగీతం. రెండు పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా ఫరవాలేదు అన్పిస్తుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.
రేటింగ్ : 2/5

Related posts