telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

వాట్సాప్ కు ఫిబ్రవరి 1 ఆఖరిరోజు… ఆ తరువాత పని చేయదు

mail provided by dot for whatsapp affected

ఫిబ్రవరి 1, 2020 వ సంవత్సరం… వాట్సాప్‌ కు ఆఖరిరోజు. అక్కడితో ఇంక వాట్సాప్‌ పనిచేయడం ఆగిపోతుంది. అయ్యబాబోయ్‌ వాట్సాప్‌ లేకపోతే ఎలా ? అని కొంతమంది కంగారు పడకండి. మరికొంతమంది మాత్రం కంగారు పడండి. ఎందుకంటే… ఇది కేవలం కొన్ని ఫోన్లకు మాత్రమే వర్తిస్తుంది. కొన్ని యాపిల్‌ ఫోన్స్‌ లోనూ కొన్ని యాండ్రాయిడ్‌ ఫోన్స్‌లోనూ ఆ రోజునుంచి వాట్సాప్‌ ఇక పనిచేయదు. మీ ఫోన్‌ కచ్చితంగా అందులో ఉండే అవకాశం తక్కువ. ఎందుకంటే iOS 8 గానీ అంతకంటే పాత వెర్షన్‌ గానీ వాడే యాపిల్‌ ఫోన్స్‌ను ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్‌ సపోర్ట్ చేయదు. అలాగే యాండ్రాయిడ్‌ మాటకొస్తే యాండ్రాయిడ్‌ వెర్షన్‌ 2.3.7 గానీ అంతకి ముందరి వెర్షన్లుగానీ ఉన్న ఫోన్లలో వాట్సాప్‌ పని చేయదు. కనీసం యాండ్రాయిడ్‌ 3.0 అయినా లేని పాత ఫోన్‌ అయితే తప్ప మీరేం కంగారు పడనక్కరలేదు. అలాగే ఐఫోన్‌ వాడేవాళ్లు కూడా వారి ఫోన్లో కనీసం iOS వెర్షన్‌ 9.0 ఉన్నా ఈ వార్త గురించి కంగారు పడాల్సిన పనిలేదు. ఇన్ని వెర్షన్లు అప్‌గ్రేడ్‌ అయినా ఇప్పటికీ పాతకాలం ఫోన్లనే పట్టుకు కూర్చుంటాం అనేవాళ్లు మాత్రం వాట్సాప్‌ని తప్పనిసరిగా త్యాగం చెయ్యక తప్పదు.

Related posts