telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

వాట్సాప్ లో మరో అద్భుత ఫీచర్!

whatsapp

రోజురోజుకూ ఎన్నో కొత్త యాప్ లు వస్తున్నా వాట్సాప్ కున్న ప్రజాదరణ దేనికీ లేదు. యూజర్ల అవసరాలు, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు అప్ డేట్ లతో వాట్సాప్ నిత్యనూతనంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. తాజాగా వినియోగదారుల సౌకర్యార్థం మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై ఫోన్ నెంబర్లను సేవ్ చేసుకోవాలంటే కేవలం ఓ క్యూర్ కోడ్ ను స్కాన్ చేస్తే సరిపోతుంది. వారి నెంబరు, పేరు సహా కాంటాక్టుల జాబితాలో నిక్షిప్తం అవుతాయి.

ఇప్పటివరకు, కాంటాక్టు లిస్టుకు నెంబర్లు ఫీడ్ చేయాలంటే, కీప్యాడ్ ఓపెన్ చేసి నెంబరు టైప్ చేసి, పేరు టైప్ చేసి ఆపై సేవ్ చేయాలి. ఈ క్రమంలో కొన్నిసార్లు ఫోన్ నెంబర్లు తప్పుగా టైప్ చేయడమో, లేక పేర్లు తప్పుగా టైప్ చేయడమో జరుగుతుంటాయి. ఇకపై అలాంటి కష్టాలకు చెక్ పెడుతూ వాట్సాప్ సరికొత్త ఫీచర్ తో అందుబాటులోకి రానుంది.

Related posts