telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

నగదు బదిలీ మరింత సులభతరం.. వాట్సాప్ లో పేమెంట్ ఆప్షన్‌!

mail provided by dot for whatsapp affected

వినియోగదారులకు మరిన్ని సేవలందించేందుకు వాట్సాప్ మరో కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకు రానుంది. ఇప్పటి వరకూ భీమ్, గూగుల్ పే తదితర యాప్‌లు అందుబాటులో ఉండగా నగదు బదిలీని సులభతరం చేసేందుకు వాట్సాప్ పేమెంట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది.ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెస్తామని వాట్సాప్ గ్లోబల్ హెడ్ విల్ కాథ్‌కార్ట్ తెలిపారు.

ఆర్‌బీఐ నుంచి అనుమతులు రావడమే తరువాయి, వాట్సాప్ పేమెంట్ ఆప్షన్ అధికారికంగా అందుబాటులోకి వస్తుంది. ముందుగా భారత్‌లోని పది లక్షల యూజర్లతో ఈ యాప్ బీటా వర్షన్‌ను ఫేస్‌బుక్ పరీక్షిస్తోంది. ఈ సందర్భంగా విల్ కాథ్‌కార్ట్ మాట్లాడుతూ, నగదు బదిలీని డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా మరింత సులభతరం చేయడమే లక్ష్యమన్నారు. దీనికోసం దేశంలోని వివిధ బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. ఒకసారి ఈ యాప్ అందుబాటులోకి వస్తే దేశంలో డిజిటల్ ఎకానమీ అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఈ ఏడాది చివరివరకు ఈ ఫీచర్ ను వాట్సాప్ లో అందుబాటులోకి తెస్తామని విల్ కాథ్‌కార్ట్ తెలిపారు.

Related posts