telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

వాట్సాప్‌ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు… ఖచ్చితంగా సెక్యూర్ కాదు…! తస్మాత్ జాగర్త!!

mail provided by dot for whatsapp affected

హ్యాకర్లు వాట్సాప్‌ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాన్ని ఆసరాగా చేసుకుని స్పైవేర్‌ చొప్పిస్తున్నారని, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఇటీవల కంపెనీ వెల్లడించింది. దీంతో వాట్సాప్‌ భద్రతపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఈ యాప్‌పై తాజాగా టెలిగ్రాం వ్యవస్థాపకుడు పవేల్‌ దురోవ్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఎందుకని వాట్సాప్‌ ఎప్పుడూ భద్రంగా ఉండదు..?’ అంటూ బ్లాగు పోస్టులో విమర్శలు చేశారు. టెలిగ్రాంలా వాట్సాప్‌ ఓపెన్‌ సోర్స్‌ కాదు. ఓపెన్స్‌ సోర్స్‌ కోడ్‌ లేకపోవడం వల్ల యాప్‌కు ఏమైనా బ్యాక్‌డోర్స్‌ ఉన్నాయా అన్నది తెలుసుకోవడం భద్రతా పరిశోధకులకు కష్టమైన పని. వాట్సాప్‌ భద్రతా వ్యవస్థలో గతంలోనూ ఇలాంటి లోపాలు తలెత్తాయి.

వాట్సాప్‌ 10ఏళ్ల ప్రయాణంలో ఒక్క రోజు కూడా ఈ యాప్‌ భద్రమైదనిగా కన్పించలేదు. అందువల్ల ఇప్పుడు కొత్తగా అప్‌డేట్‌ చేసుకున్నంత మాత్రాన యాప్‌ భద్రంగా ఉంటుందని నేను అనుకోను.. అని పవేల్‌ దురోవ్‌ విమర్శించారు. దురోవ్‌ వాట్సాప్‌ వ్యవస్థాపకులపై కూడా విమర్శలు చేశారు. యాప్‌ భద్రతకు సంబంధించిన అంశాలపై వారు ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. టెలిగ్రాంలోని కొన్ని ఫీచర్లను కూడా వాట్సాప్‌ కాపీ చేసిందని దురోవ్‌ ఆరోపించారు. వాట్సాప్‌ స్పైవేర్‌ వైరస్‌కు గురైనట్లు మంగళవారం కంపెనీ వెల్లడించింది. యాప్‌ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న ఓ లోపం ద్వారా హ్యాకర్లు ఈ స్పైవేర్‌ను ఫోన్లలోకి చొప్పిస్తున్నారని, వాట్సాప్‌ వాయిస్‌ కాలింగ్‌తో ఫోన్‌ చేసి ఈ స్పైవేర్‌ను పంపించగలుగుతున్నారని తెలిపింది. వినియోగదారులు లేటెస్ట్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని కంపెనీ సూచించింది.

Related posts