ప్రముఖ సోషల్ మెసేజింగ్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సరికొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసురానుంది. గతంలో ప్రవేశపెట్టిన ప్రైవసీ సెట్టింగ్‌ను తిరిగి యూజర్లకు అందుబాటులో తీసుకు రానుంది. చివరిసారిగా మీరు వాట్సాప్‌ను ఏ సమయంలో ఉపయోగించారో చూపించే లాస్ట్‌సీన్ సెట్టింగ్‌లో అప్‌డేట్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా మీ వాట్సాప్ కాంటాక్ట్స్‌లో ఎవరినైనా మీ లాస్ట్ సీన్ టైమ్ చూడకుండా హైడ్ చేయవచ్చు.
దీనికోసం ప్రైవసీ సెట్టింగ్లో ఇప్పటివరకు నో బడీ, ఎవ్రీవన్, మై కాంటాక్ట్స్ అనే ఆప్షన్లు కనిపించేవి. అయితే వాట్సాప్ ఇప్పుడు ఈ మూడింటితో పాటు ‘మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్’ అనే ఆప్షన్‌ను కూడా జోడించనుంది. ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ సెట్టింగ్ త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. ఈ ఆప్షన్ ద్వారా మీరు ఎంచుకున్న యూజర్‌కు మీ లాస్ట్ సీన్ కన్పించదు. మీరు చివరగా ఎప్పుడు వాట్సాప్ ఉపయోగించారో వారు తెలుసుకోలేరు.