telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సీనయ్య పని అయిపోయినట్టేనా…!

vv vinayak in & as sinayya

మాస్ డైరెక్టర్ వివి వినాయర్ కథానాయకుడిగా సినిమా రానున్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్‌గా వినాయ్‌కు మంచి పేరుంది. అయితే ఆయనను హీరోగా పెట్టి సీనయ్య అనే సినిమా తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభం అయ్యి కొంత భాగాన్ని చిత్రీకరించారు. ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ ఆకట్టుకుంది. ఇందులో వినాయక్ ఒక మెకానిక్‌గా కనిపిస్తాడు. దాంతో ఈ సినిమా ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనుంది. అయితే ఇటీవల సినీ వర్గాల్లో ఒక ప్రశ్న తలెత్తింది. అసలు సీనయ్య ఏమైపోయాడు, అసలు ఉన్నాడా అంటూ వచ్చాయి. తన సినిమా ఇంటిలిజెంట్ ప్లాప్ తరువాత సినిమాలకు వినాయర్ దూరం పాటించారు. అటువంటిది హరోగా ఓ సినిమా ఒప్పుకుని చేస్తున్నాడు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిందని అందరూ భావించారు. మరి ఇప్పుడు అన్ని సినిమాలు తిరితి షూటింగ్‌ను మొదలు చేశాయి. సీనయ్య మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఉండిపోయాడు. ఇదిలా ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్‌ను బాలీవుడ్‌కు పరిచంచేయడంతో పాటు వీవీ వినాయక్‌ కూడా బాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు. దాంతో ఈ హీందీ ఛత్రపతిపై కాస్తు ఎక్కువ శ్రద్ద పెట్టాల్సిఉంది. మరి శీనయ్య పరిస్థితి ఎంటనేది వారే తేల్చాలి.

Related posts