telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

వైరల్ : వికీలీక్స్ అసాంజే అరెస్ట్… మరి అతని పిల్లి ?

What happened to Julians Cat

వికీలీక్స్‌తో ప్రపంచంలోని అనేక మంది అవినీతిపరుల గుండెల్లో నిద్రపోయిన జూలియన్ అసాంజేను బ్రిటన్ పోలీసులు ఏప్రిల్ 11న అరెస్ట్ చేశారు. అసాంజే అరెస్ట్ అనంతరం ఆయన పిల్లి గురించిన వార్త ఇప్పుడు ప్రపంచమంతటా వైరల్ అయ్యింది. లక్షలాది మంది ఆయన పిల్లికి ఏమైందంటూ ఆందోళన చెందుతున్నారు. అసాంజే దౌత్యకార్యాలయంలో నివాసం ఏర్పరచుకున్న నాలుగేళ్ల తర్వాత.. అంటే 2016లో ‘ఎంబసీ క్యాట్’ పేరిట అసాంజే ఇన్‌స్టగ్రమ్‌లో ఓ పేజీను పెట్టి.. నిత్యం తన పిల్లి ఫొటోలు పోస్ట్ చేస్తూ వచ్చాడు. ఆ అకౌంట్‌కు 5 వేల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు.ఈ పిల్లిని అసాంజే పిల్లలు ఆయనకు బహుమతిగా ఇచ్చారని అప్పట్లో ఆయనే చెప్పారు. అది గూఢచారిగా కూడా వ్యవహరించగలదని సమాచారం. 2016లో లైంగిక నేరాల ఆరోపణలపై ఈక్వడోరియన్ ఎంబసీలో స్వీడన్ అధికారులు అసాంజేను విచారించిన తర్వాత హాజరైన మీడియాకు ఈ పిల్లి కనిపించింది. కిటికీ నుంచి తొంగి చూస్తున్న ఆ పిల్లిని విలేకర్లు ఫొటో తీశారు. స్వీడిష్ అధికారులు ప్రశ్నించిన సమయంలో ఈ పిల్లి షర్ట్, టై కట్టుకుని దర్శనమిచ్చింది. అప్పటి నుంచే ఈ పిల్లి గురించి చర్చ సాగుతూ వచ్చింది. 2017 నుంచి అసాంజే ఆ పేజీలో పిల్లి ఫొటోలు పెట్టడం మానేశాడు. అప్పటి నుంచే పిల్లికి ఏమైందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతూ వస్తున్నప్పటికీ.. ఇప్పుడు అసాంజే అరెస్ట్ అవడంతో ఆ పిల్లి వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. 

Related posts