telugu navyamedia
రాజకీయ

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ప్రతిష్ట పెరిగిందా ?

Abinandan silence to media journalists
శాంతి సాధనలో భాగంగా భారత్ వింగ్ కమేండర్ అభినందన్ వర్థమాన్ ను పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వదిలిపెట్టడంతో ఆ దేశంలో ఇమ్రాన్ ప్రతిష్ఠ పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది . జెనీవా ఒప్పందండాన్ని గౌరవించి పాకిస్తాన్ భారత్  పైలట్ ను ఎంతో మర్యాదగా చూసిందని , ప్రధాని ఉభయ సభలలో మాట్లాడుతూ అభిందన్ ను వదిలి పెడుతున్నట్టు ప్రకటించడంతో పాకిస్తాన్లో హర్షం వ్యక్తమైంది అక్కడి పత్రికలు ఇదే తెలుపుతున్నాయి .  
Pak people attack pak poilet
దాయాది దేశం అయిన భారత్ తో యుద్ధం ఎవరు కోరుకోవడం లేదని , శాంతి కావాలనుకుంటున్నారని ఆ పత్రిక తెలిపింది . ఏ  సమస్యకైనా చర్చల ద్వారా పరిస్కారం లభిస్తుందనే మాటల్లో అక్కడి ప్రజలకు బాగా నమ్మకం ఉందట . అసలే అనేక సమస్యలతో  తమతమవుతున్న పాకిస్తాన్ యుద్ధం వస్తే మరింత నష్టపోతుందని , జన జీవితం ఛిద్రమవుతుందని ,అందుకే యుద్ధం  రాకూడని రుకుంటున్నారని , అందుకే ప్రధాని శాంతి చర్చలు అనగానే అందరిలో ఆనడం కలిగిందని  ఆ పత్రిక కథనం . 
abhinandan released from pak and reached india
ఈ ఘటన తరువాత ఇమ్రాన్ ప్రతిష్ఠ ఇప్పుడు పాకిస్తాన్లో బాగా పెరిగిందని వ్రాసింది . పాకిస్తాన్ శాంతి కోరుకుంటుంటే  భారత్  మాత్రం యుద్ధం చెయ్యాలని అనుకుంటుంది , భారత్ మీడియా కూడా అత్యుత్సాహం చూపుతుంది  ,  పుల్వామా ఘటనను రాజకీయ యోజనాల కోసం  వాడుకుంటున్నారని , త్వరలో భారత్ లో ఎన్నికలు జరగబోతున్నాయని , తమకు విజయావకాశాలు పెరుగుతాయని నమ్ముతున్నారని పాక్  ప్రజలు అభిప్రాయపడుతున్నారు .
 abhinandan released from pak and reached india
ఇప్పుడు జరిగింది అంతా తమ మంచికేనని పాకిస్తాన్  ప్రజలు భావిస్తున్నారు . అంతర్జాతీయ సమాజం దృష్టిలో ఇప్పుడు పాకిస్తాన్ శాంతిని కోరుకునే దేశమని వారు భావిస్తున్నారు . 

Related posts