telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

విశాఖ : .. దక్షిణాఫ్రికా తో … భారత్ మ్యాచ్ లు..

westindies series in visakhapatnam

అక్టోబర్ 2 నుండి భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న అంతర్జాతీయ టెస్ట్‌ మ్యాచ్‌కు సంబంధించి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ మ్యాచ్‌ నిర్వహణకు పీఎంపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా నిలవనున్నది. ఇందులో భాగంగా మ్యాచ్‌ నిర్వహణ కమిటీ చైర్మన్‌, కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో టికెట్ల ధరలు నిర్ణయించడంతోపాటు ఈ నెల 15 నుంచి అమ్మకాలను ఆన్‌లైన్‌లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లో (ప్రత్యేక కేంద్రాల ద్వారా) కూడా చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఆఫ్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలకు సంబంధించిన కేంద్రాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. అలాగే ప్రతిరోజు రెండు వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్టు తీర్మానించారు. ఏసీఏ-వీడీసీఏ స్టేడియానికి 21 ప్రవేశ ద్వారాలు అందుబాటులో వుండగా…ప్రేక్షకులకు కేవలం 12 గేట్ల ద్వారానే ప్రవేశం కల్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో నగర పోలీసు కమిషనర్‌ ఆర్కే మీనా, జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన, ఆంధ్ర క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు జీవీజీకే రంగరాజు, కార్యదర్శి సీహెచ్‌ అరుణ్‌కుమార్‌, కోశాధికారి కేఎ్‌స రామచంద్రరావు, ఏపీఎ్‌సఆర్టీసీ ఆర్‌ఎం ఎంవై దానం, వీడీసీఏ కార్యదర్శి కె.పార్థసారథి, ఏసీఏ మీడియా మేనేజర్‌ మోహన్‌ పాల్గొన్నారు. కార్పొరేట్‌ బాక్సుకు సంబంధించి పరిమితంగా 30 సీట్లు అందుబాటులో ఉంటాయి. వీటి అమ్మకాలను ఏ రోజుకా రోజు చేపడతారు. కార్పొరేట్‌ బాక్సు టికెట్‌ ధరను ప్రకటించాల్సి ఉంది.

Related posts