telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఆఖరి టీ20 : .. దుమ్మురేపిన టాప్ ఆర్డర్ .. ప్రశంసలు అందుకుంటున్న విండీస్‌ ఫీల్డర్‌ ఎవిన్‌ లెవిస్‌ విన్యాసాలు …

westindies 3rd t20 target is 241

వెస్టిండీస్‌తో చివరి టీ20లో టీమిండియా ఓపెనర్లు దమ్ములేపుతున్నారు. టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ బౌలింగ్‌ ఎంచుకోవడంతో భారత్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. దీంతో ఓపెనర్లుగా వచ్చిన రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌లు వీరవిహారం చేస్తున్నారు. ఓవర్‌కు రెండు మూడు బౌండరీల చొప్పున బాదుతూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. వీరిద్దరి జోరుకు పవర్‌ప్లే ముగిసే సరికే టీమిండియా 72 పరుగులు సాధించడం విశేషం. ఈ క్రమంలో రోహిత్‌ కేవలం 23 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. అనంతరం మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ 29 బంతుల్లో6 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో అర్దసెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం టీమిండియా 10 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 114 పరుగులు చేసింది. రోహిత్‌(29 బంతుల్లో 63 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), రాహుల్‌ (31 బంతుల్లో 51 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో విండీస్‌ ఫీల్డర్‌ ఎవిన్‌ లెవిస్‌ ఫీల్డింగ్‌ విన్యాసం చూపరులను ఆకుట్టుకుంది. పెర్రీ బౌలింగ్‌లో భారత్‌ ఓపెనర్‌, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ సిక్సర్ల మోత మోగిస్తుండగా.. మరో సిక్సర్‌ బాదే క్రమంలో.. బౌండరీ లైన్‌ దగ్గర ఉన్న ఫీల్డర్‌ ఎవిన్‌ లెవిస్‌ సిక్సర్‌ వెళ్లే బంతిని అద్భుతంగా ఒడిసి పట్టాడు. అనంతరం తన బ్యాలెన్స్‌ అదుపు చేసుకోలేక.. బంతిని మైదానంలో విసిరి బౌండరీ అవతలికి జంప్‌ చేశాడు. ఈ స్టన్నింగ్స్‌ ఫీట్‌ మ్యాచ్‌కే హైలైట్‌ అవుతుందనడంలో సందేహం లేదు. కాగా, భారత ఓపెనర్లు రోహిత్‌, లోకేష్‌ రాహుల్‌ విండీస్‌ బౌలింగ్‌ను చితక్కొడుతున్నారు. పోటాపోటీగా బౌండరీలు సాధిస్తున్న ఈ జోడీ.. 5.4 ఓవర్లలో 13.09 రన్‌రేట్‌తో 72 పరుగులు సాధించారు. రాహుల్ 51 బంతుల్లో 91 పరుగులతో చెలరేగిపోయాడు. 34బంతుల్లో రోహిత్ శర్మ 71 పరుగులు చేయగా,29 బంతుల్లో కోహ్లీ 70 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 240పరుగులు చేసింది భారత్. విండీస్ విజయలక్ష్యం 241పరుగులు.

Related posts