telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రవితేజ సినిమాలో మరో హీరోయిన్… ఆమె పాత్ర ఇదేనా ?

RT66

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తోన్న 66వ చిత్రాన్ని దీపావ‌ళి సంద‌ర్బంగా అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా త‌రకెక్కుతుంద‌ని నిర్మాత ఠాగూర్ మ‌ధు తెలిపారు. డాన్‌శీను, బ‌లుపు చిత్రాల త‌ర్వాత ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రం. ఈ చిత్రంలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఇందులో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌నున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా క‌థ‌ను సిద్ధం చేస్తున్నారు. ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ రెండో వారం నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. థ‌మ‌న్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ముఖ్య పాత్ర కోసం త‌మిళ స‌ముద్ర‌ఖ‌ని నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇప్పుడు మ‌రో కీల‌క పాత్రలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ న‌టిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. క‌థ, పాత్ర న‌చ్చడంతో ఆమె ఈ సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించారు. అయితే, ఆమె ఎలాంటి పాత్ర చేస్తున్నారన్న విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. సందీప్ కిషన్ హీరోగా వస్తోన్న ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ సినిమాతో వరలక్ష్మి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు రవితేజ సినిమాలో చేయడానికి అంగీకరించారు వరలక్ష్మి.

Related posts