telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

బరువు తగ్గడానికి ఆన్లైన్ లో మందులు ఆర్డర్ చేస్తున్నారా…? జాగ్రత్త

Crime

సాధారణంగా మనం అంతర్జాలంలో ఎన్నో యాడ్స్ ను చూస్తుంటాము. అందులో చాలా యాడ్స్ నెటిజన్లను ఆకర్షిస్తుంటాయి. అయితే వాటిని ఆర్డర్ చేశామా ? ఇక అంతే సంగతులు. వాటివల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉంది. “మీరు అధిక బరువుతో బాధ పడుతున్నారా? త్వరగా బరువు తగ్గాలని అనుకుంటున్నారా? అయితే కచ్చితంగా మా మెడిసిన్ వాడాల్సిందే” అంటూ ఓ వెబ్‌సైట్లో వచ్చిన యాడ్ చూసిందామె. అంతే తన అధిక బరువును తొలగించుకొనే మార్గం దొరికిందని సంబరపడిపోయింది. వెంటనే ఆన్‌లైన్లో ఆ మందును ఆర్డర్ ఇచ్చేసింది. అయితే అలా చేయడమే ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. ఆర్డర్ ఇచ్చిన మందు వేసుకొని బరువు తగ్గుదామనుకుంటే, ఆ ఔషధం వల్ల ఆమె గుండె ఆగిపోయింది. ఈ ఘటన కువైట్‌లో శుక్రవారం వెలుగుచూసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. ఇటువంటి ఆన్‌లైన్ యాడ్లను నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ప్రజలకు సలహా ఇచ్చింది. ఇలాంటి వాటిపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఈ మోసాలకు బలికాకుండా ఉండాలని హితవు పలికింది.

Related posts