telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక సామాజిక హాస్యం

వివాహ ఆహ్వాన పత్రికలో… వాట్స్ యాప్ …మరీ ఇంత పిచ్చా…

wedding invitation as whatsapp designedf

ఒకదానిపై ఇష్టం ఏర్పడితే ప్రతిచోటా అదే ఉండాలి అనుకోవడం సహజం, అయితే అది ఎంతవరకు.. అంటే ఇష్టపడినవారి కి దానిమీద ఉన్న మక్కువను బట్టి ఉంటుంది. దీనికి చక్కటి ఉదాహరణ ఒకటి చూద్దాం.. ఇటీవల, వివాహ ఆహ్వాన పత్రికలను వెరైటీగా రూపొందించుకోవడం ఫ్యాషన్‌గా మారింది. గుజరాత్‌లోని ఓ జంట చాలా వెరైటీగా శుభలేఖను తయారు చేసుకున్నారు. ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తరహా డిజైన్‌తో కార్డును రూపొందించారు. సూరత్‌కు చెందిన అర్జూ, చింతన్‌లు వాళ్ల పెళ్లి కార్డును కొత్తగా ఉండాలని భావించి.. వాట్సాప్‌ డిజైన్‌ను ఎంచుకున్నారు. స్వతహాగా వెబ్‌ డిజైనర్‌ అయిన చింతన్‌ నాలుగు పేజీలతో శుభలేఖను రూపొందించారు. అయితే వాట్సాప్ తరహాలో తయారు చేయాలనే ఐడియా మాత్రం అర్జూ ఇచ్చినట్లు చెప్పారు.

wedding invitation as whatsapp designedf

ఈ ఆహ్వాన పత్రికలో, కవర్‌ పసుపు రంగులో ఉంటుంది. దానిపై ‘అన్‌లాక్‌ ఇన్విటేషన్‌’ అని రాశారు. లోపల కొత్త జంట ఫొటో, దాని కింద స్టేటస్‌లో ‘మీరు తప్పనిసరిగా పెళ్లికి రావాలని, లేదంటే వాట్సాప్‌లో బ్లాక్‌ చేస్తాం’ అని పేర్కొన్నారు. వాట్సాప్‌ లోగో స్థానంలో వినాయకుడి ఫొటో ప్రచురించారు. చింతన్‌కు ఈ కార్డు డిజైన్‌ చేయడానికి వారం రోజులు పట్టిందట.ఈ కొత్త జంట ఐడియాను వాళ్ల తల్లిదండ్రులు కూడా మెచ్చుకున్నారు. వీరి వివాహం ఫిబ్రవరిలో జరగనుంది. వాట్స్ యాప్ వాడేవాళ్లు అందరు ఆహ్వానితులు కాదండోయ్, ఆ పత్రిక అందిన వాళ్ళు మాత్రమే ఆహ్వానితులు.

Related posts