telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇండస్ట్రీ పునఃస‌మీక్షించుకోవాలి…లేదంటే గౌర‌వాన్ని కోల్పోతుంది : మ‌నోజ్ బాజ్‌పాయి

Manoj Bajpai

ఇటీవ‌ల బాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే సుశాంత్ ఆత్మహత్యకు కారణం నెపోటిజమే అంటూ బాలీవుడ్ స్టార్ వారసులపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌నోజ్ బాజ్‌పాయి చేసిన వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. టాలెంట్ ఉన్న వారిని సినీ ప‌రిశ్ర‌మ ప‌ట్టించుకోవ‌డం లేదంటూ ఆయ‌న ఆవేదన వ్య‌క్తం చేశారు. “యంగ్ టాలెంట్‌ను ప‌ట్టించుకోకుండా ప‌క్క‌న పెట్టేస్తున్నారు. దీని వ‌ల్ల ప్ర‌తిభ వృథా అయిపోతుంది. ఇక్క‌డ అవ‌కాశం దొర‌క‌ని వారు అంతర్జాతీయం మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అయినా మ‌నం వారిని ప‌ట్టించుకోవ‌డం లేదు. నేను చిత్ర ప‌రిశ్ర‌మ‌లో భాగ‌మే. కాబ‌ట్టి ఎవ‌రినీ కించ‌ప‌రచాల‌ని అనుకోవ‌డం లేదు. చిత్ర ప‌రిశ్ర‌మ పునఃస‌మీక్షించుకోక‌పోతే సామాన్యుల వ‌ద్ద గౌర‌వాన్ని కోల్పోతుంది’’ అని అన్నారు మ‌నోజ్ బాజ్‌పాయి.

Related posts