telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

జమ్మూ కాశ్మీర్ లో .. ఎన్నికలకు మేము సిద్ధం.. : సత్యపాల్ మాలిక్

Jammu Governor reacted attack terrarists

భారత్-పాక్ ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నాయి. కానీ, సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం ఎదురుకాల్పులు ఆగడం లేదు. జమ్ముకశ్మీర్‌లో జమాత్ ఈ ఇస్లామీ సంస్థపై నిషేధం విధించడంతో ఇక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఫిబ్రవరి 14న పుల్వామాలో దాడి అనంతరం ఈ ప్రాంతంలో మిలిటెంట్లు, భద్రతా దళాల మధ్య రోజూ కాల్పులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పుల్వామా ఘటన తర్వాత కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఈ విషయంపై గవర్నర్ మాట్లాడుతూ, సరిహద్దుల్లో అంతర్జాతీయ సమస్యలున్నాయి. ప్రతీచోట ఎదురుకాల్పులు, బాంబుల దాడి జరుగుతోంది. ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే ముందు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వాళ్లు ఒక వేళ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమైతే మేం కూడా సిద్ధమే. అందుకే బలగాలను కూడా రప్పించాం. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా మేం పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాం. ఒక వేళ ఎన్నికల సంఘం ఆదేశిస్తే మేం ఎన్నికలు నిర్వహిస్తాం అని సత్యపాల్ మాలిక్ అన్నారు.

Related posts