telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ : … నీళ్ల ట్యాంకర్ల బాధ్యత.. వాటర్ బోర్డుకు అప్పగింత..

water supply tank responsibility to water board

ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలో మంచినీటి పైప్‌లైన్ నెట్‌వర్క్‌లేని కొన్ని మారుమూల ప్రాంతాలకు బల్దియా ఆధ్వర్యంలో నీటి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తుండగా, వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి ఈ బాధ్యత వాటర్‌బోర్డు చేపట్టనుంది. 40 వాటర్ ట్యాంకర్ల ద్వారా సగటున ఎనిమిది ట్రిప్పుల చొప్పున రోజూ 327 ట్రిప్పుల నీటి సరఫరా జరుగుతుంది. వాటర్‌బోర్డు నీటిని ఉచితంగా అందిస్తుండగా, జీహెచ్‌ఎంసీ ద్వారా ట్యాంకర్లకు ట్రిప్పుకు రూ. 300 చొప్పున చెల్లిస్తున్నారు. గతంలో నీటి సరఫరా నెట్‌వర్క్ లేనప్పుడు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరాచేసే విధానాన్ని చేపట్టగా, ఇటీవలికాలంలో మిషన్ భగీరథ పథకం ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలకు పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటై నల్లానీరు సరఫరా అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో నీటి ట్యాంకర్లకు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ ఉచిత ట్యాంకర్లను ట్యాంకర్ యజమానులు అక్రమంగా హోటళ్లు, ఫంక్షన్ హాళ్లకు అమ్ముకుంటున్నారు. అంతేకాదు, వాటర్‌బోర్డు ఉద్యోగులతో కుమ్మక్కు కావడంతో రోజూ వందలాది ట్యాంకర్ల నీటిని దారి మళ్లిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని జీహెచ్‌ఎంసీ ట్యాంకర్ల బాధ్యతను పూర్తిగా వదిలించుకొని వాటర్‌బోర్డుకు అప్పగించాలని నిర్ణయించింది.

Related posts