telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

వేసవిలో చల్లగా.. పుచ్చకాయ విత్తనాలు.. !

water melon seeds for health

ఈ సారి కూడా వేస‌వి కాలం వ‌చ్చేసింది. ప్రారంభంలోనే ఎండ‌లు మండిపోతున్నాయి. దీనితో అంద‌రూ శ‌రీరానికి చ‌ల్ల‌దనాన్నిచ్చే ఆహార ప‌దార్థాల కోసం చూస్తున్నారు. అలాంటి వాటిలో పుచ్చ‌కాయ‌లు చాలా ముఖ్య‌మైన‌వి. ఈ సీజ‌న్‌లో ఎక్కువ‌గా ల‌భించే పుచ్చ‌కాయ‌ల‌ను నిత్యం తింటే.. శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం ల‌భిస్తుంది. ప‌లు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. అయితే కేవ‌లం పుచ్చ‌కాయ‌లే కాదు, వాటి విత్త‌నాల‌ను కూడా మ‌నం తిన‌వ‌చ్చు. వాటితో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

* డ‌యాబెటిస్ ఉన్న‌వారు పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను నిత్యం తింటుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. ర‌క్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి.

* హైబీపీ ఉన్న‌వారు పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను తింటే బీపీ త‌గ్గుతుంది. బీపీ త్వ‌ర‌గా అదుపులోకి వ‌స్తుంది.

* పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల కండ‌రాలు దృఢంగా మారుతాయి. అల‌స‌ట త‌గ్గుతుంది.

* మెద‌డు ప‌నితీరు మెరుగ్గా ఉండాలంటే పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను రోజూ తినాలి.

* కంటి చూపును మెరుగుప‌రిచే అద్భుత‌మైన ఔషధ గుణాలు పుచ్చ‌కాయ విత్త‌నాల్లో ఉంటాయి. వీటిని నిత్యం తింటుంటే నేత్ర స‌మ‌స్య‌లు పోతాయి.

Related posts