telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఉదయాన్నే తాగునీరు.. ఆరోగ్యానికి అందుకే మేలు..

water consumption on empty stomach

నిద్ర లేవగానే టీ, కాఫీ లకు బదులుగా.. తాగాలనిపించినన్ని(దాదాపుగా అలా లీటర్) నీటిని తాగితే ఆరోగ్యం అంటున్నారు వైద్యులు. దీనివలన ఉదయాన్నే శరీరానికి కావాల్సిన నీటిలో ఎక్కువ శాతం అందుతుంది. మనశరీరంలో 80 శాతం నీరు ఉంటుందని అందరికి తెలిసిందే. దానిని బట్టి మనం నీరు తీసుకోవడం యెంత ముఖ్యమో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఉదయాన్నే, పరగడుపున తీసుకునే నీటితో రోజంతా హుషారుగా ఉండేందుకు వీలుంటుంది. అలాగే, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేమితో కొన్ని చూద్దాం…

– ఉదయం లేచిన వెంటనే మంచినీళ్లు తాగితే మల విసర్జన సులభంగా జరుగుతుంది.
– పరగడుపున నీళ్లు తాగటం వల్ల ఒంట్లో పేరుకుపోయిన వ్యర్ధాలు ఏ రోజుకారోజు బయటికి వెళ్లిపోతాయి.
– పెద్ద పేగు శుభ్ర పడి ఆహారంలోని పోషకాలను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది.

– రక్త వృద్ధి, శుద్ధి జరిగేందుకు ఉదయం తాగే నీరు ఉపయోగపడుతుంది.
– కండరాలు బలపడి, చక్కగా పెరిగేందుకు తగినంత నీరు తాగటం అవసరం.
– జీవక్రియల పనితీరు సగటున 24 శాతం మేర పెరుగుతుంది.
– బరువు తగ్గే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.
– చర్మం సహజంగా, తగినంత తేమతో, మృదువుగా మారుతుంది.

– మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్ల ముప్పు తక్కువ. వచ్చినా వెంటనే తగ్గుతాయి.
– ఆకలి, జీర్ణశక్తి పెరుగుతాయి.

Related posts