telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

90ల్లో షారుఖ్ యాంకరింగ్… వీడియో వైరల్

Sharukh

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న ఈ షారూఖ్ ను ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాపులు పలకరిస్తున్నాయి. షారుఖ్ చివ‌రిగా “జీరో” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం షారూఖ్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అయినప్పటికీ బాలీవుడ్‌లో షారుక్ ఖాన్‌కి అశేష అభిమానులున్నారు. పాకిస్థాన్‌తో పాటూ చాలా దేశాల్లో ఆయన సినిమాలను ఎంతో ఆసక్తిగా చూస్తారు. అంతలా ప్రపంచ గుర్తింపు తెచ్చుకున్న బాద్షా… ఒకప్పుడు దూరదర్శన్‌లో యాంకరింగ్ చేసేవాడని చాలా మందికి తెలియదు. బాలీవుడ్‌లో అడుగుపెట్టక ముందు షారుక్ కొన్ని టీవీ షోలు చేశాడు. తన కెరీర్ ప్రారంభంలో చాలా కామెడీ, ఇతర టీవీ షోలకు యాంకరింగ్ చేశాడు. అలాంటి వాటిలో న్యూఇయర్ సందర్భంగా దూరదర్శన్‌లో జరిగిన షోలో షారుక్… కో-యాంకర్‌గా ఉన్న క్లిప్ ఒకటి ఇప్పుడు బయటికొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లోని బాలీవుడ్ డైరెక్ట్ అనే పేజీలో ఈ క్లిక్ షేర్ అయ్యింది. ఈ పేజీలో తరచుగా ఇలాంటి బాలీవుడ్ సెలబ్రిటీల గత జ్ఞాపకాల క్లిప్స్ షేర్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అయిన క్లిప్‌లో షారుక్… బ్యాగీ ట్రౌజర్స్, షర్ట్‌లో కనిపిస్తూ… 90ల్లో పేరున్న సింగర్ కుమార్ సానూను ఇంట్రడ్యూస్ చేశాడు. మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి.

 

View this post on Instagram

 

#ShahrukhKhan as a tv anchor for a singing programs of #Doordarshan. #srk #shahrukh

A post shared by Bollywoodirect (@bollywoodirect) on

Related posts