telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

అమర్‌నాథ్‌ యాత్ర పై .. ఉగ్ర కన్ను .. వెంటనే వెనుదిరగాలని యాత్రికులకు హెచ్చరికలు..

amarnath yatra

జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన యాత్రికులు వెంటనే తిరుగుముఖం పట్టాలని సూచించింది. అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్రవాదులు కుట్ర పన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్ర మూకలు దృష్టి సారించినందున వీలైనంత త్వరగా వెనుదిరగాలని ప్రభుత్వం శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించింది.

తాజాగా భారత ఆర్మీ కూడా అమర్‌నాథ్‌ యాత్రలో హింసను సృష్టించేందుకు పాక్ కుట్ర పన్నిందని ప్రకటించింది. ఆ దారిలో కొన్ని చోట్ల మందు పాతరలు, స్నిపర్‌ రైఫిళ్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆయుధాలపై పాకిస్థాన్‌ ఆయుధాగారానికి సంబంధించిన గుర్తులు ఉన్నాయని చెప్పారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ఇంకా గాలింపు చర్యలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కుట్రకు పాక్‌ ఆర్మీకి ప్రత్యక్ష సంబంధాలున్నాయని తెలిపారు. ఇక్కడ అశాంతి నెలకొల్పాలనే పాక్‌ సైన్యం ప్రయత్నాలను సాగనీయబోమని హెచ్చరించారు. ఉగ్రదాడి జరిగే అవకాశముందని ఆర్మీ హెచ్చరించిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అమర్ నాథ్ యాత్రికులు వెంటనే కశ్మీర్ ను వదిలి వెళ్లిపోవాలని, శిబిరాలను ఖాళీ చేయాలని స్పష్టం చేసింది.

Related posts